AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs PBKS Playing XI IPL 2022: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..

ఇక ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ రెండు మార్పులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ స్థానంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్‌ని చేర్చారు. మరోవైపు పంజాబ్ మూడు మార్పులు చేసింది.

SRH vs PBKS Playing XI IPL 2022: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
Srh Vs Pbks Playing Xi Ipl 2022
Venkata Chari
|

Updated on: May 22, 2022 | 7:37 PM

Share

ఐపీఎల్ 2022 (IPL 2022) లీగ్ దశ చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో చివరి అంటే 70వ లీగ్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (SRH vs PBKS) ఈ మ్యాచ్‌లో ముఖాముఖి తలపడుతున్నాయి. హైదరాబాద్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్‌లో ఉన్న ఏకైక లక్ష్యం ఏమిటంటే, తమ ప్రయాణాన్ని విజయంతో ముగించాలని కోరుకుంటున్నాయి. రెండు జట్లలో మార్పులు జరిగాయి. కేన్ విలియమ్సన్ తనకు బిడ్డ పుట్టిన కారణంగా న్యూజిలాండ్‌కు తిరిగి వెళ్లాడు. హైదరాబాద్ కెప్టెన్సీలో మార్పు కీలకంగా ఉంది. అతని స్థానంలో భువనేశ్వర్ కుమార్ జట్టు కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

ఈ మ్యాచ్‌తో ఇరు జట్లు తమ సీజన్‌ను ముగించుకుంటాయి. ప్రదర్శనలో నిలకడ లేకపోవడంతో ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నాయి. రెండు జట్లు తలో 3 మ్యాచ్‌లు ఆడి కేవలం 12 పాయింట్లు సాధించాయి. ఇక పాయింట్ల పట్టికలో తవ స్థానం మెరుగుపరుచుకోవడమే ఇరు జట్లకు ఏకైక లక్ష్యం. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పంజాబ్ ఒక స్థానం ఎగబాకి ఏడో స్థానానికి చేరుకోగా, హైదరాబాద్ ఎనిమిదో స్థానంలో ఉంది. గెలిచిన జట్టు కోల్‌కతా కంటే ఆరో స్థానానికి చేరుకుంటుంది.

రెండు జట్లలోనూ ఈ మార్పులు చోటు చేసుకున్నాయి..

ఇవి కూడా చదవండి

ఇక ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ రెండు మార్పులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ స్థానంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్‌ని చేర్చారు. షెపర్డ్ ప్రారంభ మ్యాచ్‌లు ఆడాడు. కానీ పేలవమైన ప్రదర్శన కారణంగా తొలగించారు. టి నటరాజన్‌కు విశ్రాంతి ఇవ్వగా, అతని స్థానంలో ఆల్‌రౌండర్ జగదీశ సుచిత్ తిరిగి వచ్చాడు. మరోవైపు పంజాబ్ మూడు మార్పులు చేసింది. వీటిలో భానుకా రాజపక్సే, రిషి ధావన్, రాహుల్ చాహర్‌లను తొలగించగా, షారుక్ ఖాన్ చాలా కాలం తర్వాత తిరిగి వచ్చాడు. వీరితో పాటు ప్రేరక్ మన్కడ్, నాథన్ ఎల్లిస్ కూడా జట్టులోకి వచ్చారు.

SRH vs PBKS: ప్లేయింగ్ XI..

సన్‌రైజర్స్ హైదరాబాద్: భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, ఐదాన్ మర్క్రమ్, నికోలస్ పూరన్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, జగదీషా సుచిత్, ఫజ్ల్హాక్ ఫరూకీ, రొమారియో షెపర్డ్, ఉమ్రాన్ మాలిక్

పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టన్, జితేష్ శర్మ (కీపర్), షారూఖ్ ఖాన్, ప్రేరక్ మన్కడ్, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్

Also Read: IPL 2022: ముంబై గెలుపుతో సంబురాలు చేసుకున్న ఆర్‌సీబీ ఆటగాళ్లు.. డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ..

IPL-2022: ఆయన చేసిన తప్పిదాలతోనే.. ముంబై గెలిచింది బెంగళూరు మురిసింది ఢిల్లీ ఓడింది.. అసలు విషయం ఏంటంటే..