AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kapil dev: కపిల్ దేవ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారా.. ఊహాగానాలకు తెరదించిన ఆల్‌రౌండర్‌..

మాజీ క్రికెటర్ కపిల్ దేవ్(Kapil dev) రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే అతను ఈ వార్తలను తోసిపుచ్చాడు...

Kapil dev: కపిల్ దేవ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారా.. ఊహాగానాలకు తెరదించిన ఆల్‌రౌండర్‌..
Kapil Dev
Srinivas Chekkilla
|

Updated on: May 22, 2022 | 6:50 PM

Share

మాజీ క్రికెటర్ కపిల్ దేవ్(Kapil dev) రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే అతను ఈ వార్తలను తోసిపుచ్చాడు. ఈ గొప్ప ఆల్ రౌండర్ తాను ఆమ్ ఆద్మీ(AAP) పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశాడు. కపిల్‌పై ఇలాంటి రూమర్‌ రావడం ఇదే మొదటిసారి కాదు. ఇది ఇంతకు ముందు జరిగింది. కపిల్ 1983లో భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. దేశంలోనే అత్యంత విజయవంతమైన ఆల్‌రౌండర్ల(All Rounder)లో ఒకడిగా నిలిచాడు. అతను క్రికెట్‌కు దూరమై చాలా కాలం అవుతున్నా అభిమానుల్లో అతనిపై ఉన్న ప్రేమకు కొదవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఆయన పాపులారిటీని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తునే ఉన్నాయి.

హర్యానాలో 2024లో విధానసభ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ కొద్దిరోజుల క్రితం హర్యానా చేరుకున్నారు. ఇక్కడ అతను కపిల్ దేవ్‌ను కలిశాడు. కేజ్రీవాల్‌తో కపిల్ దేవ్ ఉన్న ఫోటో వైరల్‌గా మారింది. కపిల్ దేవ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. కురుక్షేత్రలో కేజ్రీవాల్ ర్యాలీలో కపిల్ దేవ్ పాల్గొంటారని కూడా వార్తలు వచ్చాయి. అయితే కపిల్ దేవ్ ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, ‘నేను రాజకీయ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త పూర్తిగా తప్పు. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఈ రూమర్‌తో నేను చాలా నిరాశకు గురయ్యాను. నన్ను నమ్మండి, నేను ఎప్పుడైనా ఇంత పెద్ద అడుగు వేస్తే, నేను దానిని బహిరంగంగా ప్రకటిస్తాను. అని అన్నారు. కపిల్ దేవ్‌తో పాటు, ఒలింపిక్ పతక విజేత బాక్సర్ విజేందర్ సింగ్ కూడా అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశాడు. ఇది కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీని చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి…