India vs England: చోటు దక్కించుకున్న ‘నయావాల్‌’.. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ ఆడే తుది భారత జట్టు ఇదే..

జులై 1 నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రారంభం కానున్న గతేడాది టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ ఆడే భారత జట్టును బీసీసీఐ నేడు ప్రకటించింది.

India vs England: చోటు దక్కించుకున్న 'నయావాల్‌'.. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ ఆడే తుది భారత జట్టు ఇదే..
Team India
Follow us

|

Updated on: May 22, 2022 | 6:23 PM

ఇంగ్లండ్‌లో చరిత్రాత్మక టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వచ్చే నెలలో బయలుదేరనున్న భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు తొలిసారిగా విదేశీ గడ్డపై టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఇంగ్లండ్ టూర్‌లో (India vs Engalnd) టీమ్ ఇండియా ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇది కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ కారణంగా గతేడాది సిరీస్‌లో ఆడలేకపోయింది. ఈ ఏకైక టెస్టు కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలక్షన్ కమిటీ 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే, ఛెతేశ్వర్ పుజారా మాత్రం జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Also Read: IND vs SA T20 Team Squad 2022: శాంసన్‌కు షాక్.. ఉమ్రాన్‌కు బూస్ట్.. దక్షిణాఫ్రికాతో తలపడే భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ఎవరంటే?

మే 22 ఆదివారం, BCCI ఈ టెస్ట్ జట్టుతోపాటు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ కోసం టీమ్ ఇండియాను ప్రకటించింది. టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత జట్టులో ఎవరున్నారో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. టెస్టు జట్టు విషయానికొస్తే.. ఊహించినట్లుగానే పెద్దగా మార్పులేమీ లేవు. అయితే, ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను తప్పించారు. జట్టులో ఓపెనింగ్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉండగా, బ్యాకప్ ఓపెనర్‌గా శుభ్‌మాన్ గిల్ జట్టులో భాగమయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కారణంగా రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లి వంటి ప్రముఖ ఆటగాళ్లకు దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతి లభించింది. ఛెతేశ్వర్ పుజారా జట్టులోకి వచ్చాడు. గత కొన్ని నెలలుగా పేలవమైన ఫామ్‌తో అతను ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల అతను ఇంగ్లండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లోని సెకండ్ డివిజన్‌లో ససెక్స్ తరఫున పరుగుల వరద పారించాడు. పుజారా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు, రెండు సెంచరీలతో 700కు పైగా పరుగులు చేశాడు. ఇందుకుగానూ టెస్టు జట్టులోకి పునరాగమనం రూపంలో అతనికి బహుమతి లభించింది.

టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, ఛెతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (వికెట్), కేఎస్ భరత్ (వికెట్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ

Also Read: IND vs SA T20 Team Squad 2022: శాంసన్‌కు షాక్.. ఉమ్రాన్‌కు బూస్ట్.. దక్షిణాఫ్రికాతో తలపడే భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ఎవరంటే?

Umran Malik: టీమిండియాలో చోటు దక్కించుకున్న ఉమ్రాన్‌ మాలిక్‌.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక..

Latest Articles
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..