స్నేహితుడితో కలిసి మోసం చేసిన భార్య.. ఆత్మహత్య చేసుకుందామనుకున్న క్రికెటర్.. కట్‌చేస్తే.. టీమిండియాలోకి రీఎంట్రీ..

ఈ విషయం ఆ నోటా ఈ నోట విన్న దినేష్ ఒక్కసారిగా షాకయ్యాడు. అంతే కాదు తన చిన్ననాటి స్నేహితుడు చేసిన మోసం నుంచి ఎలా బయట పడాలో అర్ధం కాక.. అయోమయ స్థితికి చేరిపోయాడు. నికితకు విడాకులిచ్చే సమయానికి ఆమె గర్భవతి. చేసేది లేక..

స్నేహితుడితో కలిసి మోసం చేసిన భార్య.. ఆత్మహత్య చేసుకుందామనుకున్న క్రికెటర్.. కట్‌చేస్తే.. టీమిండియాలోకి రీఎంట్రీ..
Dinesh Karthik
Follow us

|

Updated on: May 24, 2022 | 7:05 AM

సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌కు జట్టును ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 36 ఏళ్ల వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ స్థానంలో ఈ జట్టుకు చోటు దక్కింది. కార్తీక్ 2019 తర్వాత టీమ్ ఇండియాకు తిరిగి వచ్చాడు. జట్టులోకి వచ్చిన తర్వాత కార్తీక్ భావోద్వేగానికి గురయ్యాడు. అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ‘మీపై మీకు నమ్మకం ఉంటే, అంతా బాగానే ఉంటుంది. మీ మద్దతు, నమ్మకానికి ధన్యవాదాలు. నా కృషి కొనసాగుతూనే ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 15వ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకుగానూ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి రివార్డ్ అందుకున్నాడు. ఈ సీజన్‌లో కార్తీక్ బెంగళూరుకు ఫినిషర్ పాత్రను పోషించగా, అతను టీమ్ ఇండియాకు తిరిగి రావాలని క్లెయిమ్ చేస్తూ ప్లే-ఆఫ్‌లకు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అభిరుచి ముందు వయసును ఓడించవచ్చని తన నటనతో చూపించాడు. కార్తీక్ ఈ ఏడాది ఆడిన 14 మ్యాచ్‌ల్లో 191.33 స్ట్రైక్ రేట్‌తో 287 పరుగులు చేశాడు.

Also Read: Rishabh Pant: మాజీ క్రికెటర్ చేతిలో మోసపోయిన టీమిండియా స్టార్ ప్లేయర్.. రూ.1.6 కోట్లు హాఫంట్.. ఎందుకంటే?

ఒకప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్‌కి కెప్టెన్‌గా చేసిన దినేష్ తర్వాత ఆ జట్టు ఐపీఎల్ ఛాంపియన్ కాక పోవడంతో దినేష్ ను రిజెక్ట్ చేయడం. తర్వాత డీకే- ఆర్సీబీసీ సెలక్ట్ కావడం.. ఇదిగో ఇప్పుడిలా మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్లేయర్‌గా ఎదగడం ఏ గ్రేట్ కెరీర్ ఓరియెంటెడ్ స్టోరీ. కానీ, ఇదే దినేష్ నాణానికి మరో వైపు కూడా ఉంది.. అదే అతడి ఫెయిల్యూర్ పర్సనల్ లైఫ్..

దినేష్ కార్తిక్ అందరి క్రికెటర్ల లాంటి క్రికెటర్ కాదు.. తన వ్యక్తిగత జీవితంలో అతడొక దగాపడ్డ వ్యక్తి.. తన చిన్ననాటి స్నేహితుడు మురళీ విజయ్ చేసిన నమ్మక ద్రోహానికి బలయ్యాడు. ఫ్రెండే కదాని దగ్గరకు తీస్కుంటే.. దినేష్ జీవితాన్నే తీసుకెళ్లిపోయిన ఘనుడు మురళీ.. ఫ్రెండ్ తన గుండెల మీద కొట్టిన స్ట్రోక్‌కి.. ఇంకొకరైతే ఈ పాటికి అటో ఇటే తేల్చేసి ఉండేవారు. కానీ, దినేష్ ఇటు ఆటలో రాణించలేక.. అటు స్నేహితుడు కట్టుకున్న భార్యను ఏమీ చేయలేక.. నిరాశా నిస్పృహలను నిశ్శబ్దంగా అనుభవించడం మొదలు పెట్టాడు. అంతే కాదు.. ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామా? అన్న మానసిక స్థితితికి వెళ్లి పోయాడు.

ఇవి కూడా చదవండి

మోడ్రన్ లైఫ్ స్టైల్‌కి బలైన క్రికెటర్లలో దినేష్ కార్తిక్ ముందు వరుసలో నిలుస్తాడు. ఇంతకీ దినేష్ విషయంలో అంతగా ఏం జరిగిందంటే.. దినేష్ కార్తిక్- మురళీ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్. దినేష్ కి క్రికెట్ అంటే అంతులేని ప్రేమ. ఎప్పటికైనా ధోనీ‌కి సాటిరాగల క్రికెట్ కీపర్ కమ్ డ్యాషింగ్ బ్యాట్స్ మన్‌గా .. ఎదగాలన్నది అతడి లైఫ్ టైం డ్రీం. అందులో భాగంగానే రంజీల్లో రాణించి, తమిళనాడు కెప్టెన్ స్థాయికి చేరాడు. అక్కడి నుంచి 2004లో ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్టయ్యాడు. అలా ఇండియన్ క్రికెట్ ప్లేయర్‌గా ఎదుగుతూ వచ్చిన దినేష్‌కి ఫ్యామిలీ ఫ్రెండ్ నికితతో పెళ్లయ్యింది. ఇద్దరి వైవాహిక జీవితం ఎంతో సజావుగా సాగుతోంది.

దినేష్ కార్తిక్‌తో పాటు మురళీ విజయ్ కూడా కాల- క్రమేణా ఇండియన్ క్రికెట్‌లో ఎదుగుతూ వచ్చాడు. టీం ఇండియా మెంబరయ్యి.. దినేష్‌కి సమాంతరంగా మురళి సైతం పేరు సాధిస్తూ వచ్చాడు. ఈ దశలో ఇద్దరు మిత్రుల మధ్య ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ గట్టిగా నడిచింది. సరిగ్గా ఇదే సమయంలో మురళీ విజయ్- దినేష్ కార్తిక్ భార్య నికితల మధ్య పరిచయం కాస్తా ప్రేమగా పరిణమించింది. దీంతో ఇద్దరి సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో వారిద్దరూ కలసి దినేష్‌కి తెలీకుండా తమ రహస్య స్నేహితాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

ఈ విషయం ఆ నోటా ఈ నోట విన్న దినేష్ ఒక్కసారిగా షాకయ్యాడు. అంతే కాదు తన చిన్ననాటి స్నేహితుడు చేసిన మోసం నుంచి ఎలా బయట పడాలో అర్ధం కాక.. అయోమయ స్థితికి చేరిపోయాడు. నికితకు విడాకులిచ్చే సమయానికి ఆమె గర్భవతి. చేసేది లేక.. ఆమె నుంచి దూరమైన దినేష్.. తర్వాత తీవ్ర నిరాశనిస్పృహల్లోకి జారుకున్నాడు. ఒక దశలో దినేష్‌కి క్రికెట్ దూరమైపోయింది.. అంచెలంచెలుగా ఎదుగుతూ రావల్సిన వాడుకాస్తా.. జీవితమనే పరమపద సోపాన పటంలో.. భార్య నికిత పాము రూపంలో మింగేయగా.. తిరిగి మొదటికే వచ్చింది దినేష్ కార్తిక్ జీవితం. ఇండియన్ క్రికెట్ నుంచి మాత్రమే కాదు రంజీల నుంచి కూడా బయటకొచ్చేశాడు. వింత ఏంటంటే తమిళనాడు కెప్టెన్‌గా అతడి స్థానంలో మురళీ విజయ్ సెలెక్టయ్యాడు. ఈ అవమాన భారం భరించలేక- సూసైడ్ అటెంప్ట్ చేశాడు దినేష్ కార్తిక్.

ఈ విషయం తెలిసిన ట్రైనర్ దినేష్‌ను కలిసి.. తిరిగి జిమ్‌కి రావల్సిందిగా కోరాడు. అతడు ఒప్పుకోకున్నా బలవంతానా జిమ్‌కి వచ్చేలా చేశాడు. ఎప్పటిలాగానే మాములు మనిషి అయ్యే క్రమంలో అతడికో తోడు దొరికింది. ఆ తోడు నీడ పేరే దీపిక పల్లికల్. దీపిక మహిళల ఇండియన్ స్క్వాష్ ఛాంపియన్. బేసిగ్గా క్రికెటర్లంటే పెద్ద అభిప్రాయం లేని.. దీపికకు ఎందుకనో దినేష్‌ను చూడగానే ఒకింత మంచి ఒపీనియన్ ఏర్పడింది. దీంతో అతడితో స్నేహం పెంచుకుంది. అప్పటి నుంచి దినేష్ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం.

ఇరువురి మనసులు కలిశాయి. దీపిక- దినేష్‌ల పెళ్లికి మార్గం సుగమం అయ్యింది. ఇద్దరి వివాహ బంధం ముడి పడ్డంతో.. తిరిగి దినేష్ కార్తిక్ ఎప్పటిలాగానే తనదైన ఛాంపియన్ ఆటతీరును కొనసాగించడం మొదలు పెట్టాడు. ఇవాళ దినేష్ కార్తిక్ ఓల్డెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీం. ఇంగ్లండ్ వెళ్లే.. టీ- 20 టీంలోకి గ్రాండ్ గా రీ-ఎంట్రీ ఇచ్చాడు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. మహా పురుషులవుతారు.. అనడానికి డీకే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం దీపిక- దినేష్ దంపతులకు కవల పిల్లలు. అంతే కాదు దినేష్‌తో పాటు పెళ్లయ్యాక దీపిక కూడా ఇండియన్ స్క్వాష్ డబుల్స్‌లో ఛాంపియన్ నిలవడం కొసమెరుపు.

ఒకప్పుడు మురళీ విజయ్ అనే చిన్ననాటి స్నేహితుడు, తన ఫస్ట్ వైఫ్ నికిత చేసిన మోసం కారణంగా.. ఇండియన్ క్రికెట్ టీం నుంచి దూరం కావడం మాత్రమే కాదు.. రంజీ, తమిళనాడు కెప్టెన్సీ, ఐపీఎల్ సర్వస్వం కోల్పోయి.. ఒక దశలో దేవదాసుగా మారి.. ఆత్మహత్య చేసుకుందామా? అనే వరకూ వచ్చి.. తిరిగి జిమ్ ట్రైనర్ పుణ్యమాని వర్కవుట్లు చేస్తూ.. దీపిక పల్లికల్ తో ప్రేమ పెళ్లి.. ధోనీ కారణంగా తిరిగి తన కెరీర్ గాడిన పడ్డంతో.. దినేష్ కార్తిక్.. ఇప్పడొక ఇన్ స్పిరేషనల్ స్టోరీ. ఒక సినిమా తీయడానికి వీలున్నంత ఆటో బయోగ్రఫీ గల స్పోర్ట్స్ పర్సనాల్టీ.

అందుకే అంటారు.. జీవితం అయిపోయిందనుకున్న చోటే మొదలవుతుందని. కాకుంటే ఆ సమయం వచ్చే వరకూ మన మీద మనకు నమ్మకం ఉండాలి. అందుకు తగిన ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుంటూ రావాలి. ఒక రోజుల్లో తనకు ద్రోహం చేసిన ఫ్రెండ్- మురళీ విజయ్ కెరీర్ నామరూపాల్లేకుండా పోతే.. 37 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్లతో పోటీగా దినేష్ చేస్తున్న ఈ డ్యాషింగ్ నాక్.. ఎందరో క్రికెటర్లకు .. ఆ మాటకొస్తే సామాన్యులకు కూడా ఒక ఆదర్శనీయం. పడిలేచిన కెరటం లాంటి దినేష్ సెకండ్ ఇన్సింగ్స్ మరింత సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుతూ.. ఆల్ ద బెస్ట్ డీకే.. ఇట్స్ యువర్ టైం.. నాక్ వన్స్ అండ్ వన్స్ అగైన్.. హ్యావే గ్రేట్ కెరీర్.. ఇన్ టీం ఇండియా. అంటూ విష్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఆఫ్‌ డీకే.

Also Read: IPL 2022: ఐపీఎల్ 2022లో సత్తా చూపినా.. సెలక్టర్లు కరుణించలే.. ఈ ఐదుగురికి మరోసారి తప్పని నిరాశ..

Sourav Ganguly: కొత్త ఇల్లు కొన్న సౌరవ్ గంగూలీ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..