Royal Challengers Bangalore: బెంగళూర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ ఇస్తోన్న తుఫాన్ బ్యాట్స్‌మెన్.. ఎప్పుడంటే?
ఐపీఎల్‌లో 156 మ్యాచ్‌లు ఆడిన ఏబీ డివిలియర్స్ 2 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలతో 4,491 పరుగులు చేసి, క్రిస్ గేల్‌తో కలిసి RCB హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రస్తుతం అంతా సక్రమంగా జరుగుతోంది. అదృష్టంతో ప్లేఆఫ్ టిక్కెట్‌ను పొందిన ఆర్‌సీబీ.. ప్రస్తుతం IPL 2022 టైటిల్‌ను గెలుచుకోవడానికి పోరాడనుంది. అయితే, ఇప్పుడు ఈ టీమ్‌కు మరో గుడ్ న్యూస్ అందనుంది. ఆ జట్టు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్(AB De Villiers) తదుపరి సీజన్‌లో ఆర్‌సీబీ కోసం ఆడటం కనిపిస్తుంది. ఐపీఎల్ 2023లో డివిలియర్స్ పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా(South Africa) మాజీ క్రికెట్ స్టార్ గత సంవత్సరం అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. IPL 2022 డివిలియర్స్ ఆడని మొదటి సీజన్ ఇదే కావడం గమనార్హం. అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్)తో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ ఫ్రాంచైజీ నుంచి మొదటి 3 సీజన్లు ఆడిన తర్వాత, అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టులో భాగమయ్యాడు. ఈ జట్టు తరపున 11 సీజన్‌లు ఆడాడు.
ఐపీఎల్‌లో 156 మ్యాచ్‌లు ఆడిన ఏబీ డివిలియర్స్ 2 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలతో 4,491 పరుగులు చేశాడు. ఇటీవలే డివిలియర్స్‌తోపాటు క్రిస్ గేల్‌కు కూడా RCB హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.
వచ్చే సీజన్‌లో RCB తరపున ఆడతాను – AB డివిలియర్స్
విరాట్ కోహ్లి ప్రకటనను AB డివిలియర్స్ ధృవీకరించాడు. IPL తదుపరి సీజన్‌లో దక్షిణాఫ్రికా తుఫాన్ బ్యాట్స్‌మెన్ తిరిగి వస్తాడని కోహ్లీ పేర్కొన్నాడు. ఆర్‌సీబీ నుంచి మాత్రమే ఐపీఎల్ ఆడతాడన్న విరాట్ కోహ్లీ మాటలను ఏబీ డివిలియర్స్ సమర్ధించాడు.
VUSportతో సంభాషణలో, ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ, “విరాట్ వార్తలను ధృవీకరించినందుకు నేను సంతోషిస్తున్నాను. నిజం చెప్పాలంటే, ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. కానీ, అవును నేను IPL తదుపరి సీజన్‌లో ఆడే ఛాన్స్ ఉంది. అది ఎలా జరుగుతుంది, నేను ఏ స్ఠానంలో ఉంటానో ప్రస్తుతం తెలియదు” అని పేర్కొన్నాడు. ఐపీఎల్ తదుపరి సీజన్‌లో డివిలియర్స్ తిరిగి వస్తాడని విరాట్ కోహ్లీ ఇంతకుముందు చెప్పిన సంగతి తెలిసిందే.
ఏబీడీ కంటే ముందు గేల్..
ఏబీ డివిలియర్స్ లాగా, క్రిస్ గేల్ కూడా IPL 2022లో భాగం కాదు. అతనితో ఫ్రాంచైజీల ప్రవర్తనకు సంబంధించి ఈ సీజన్ వేలంలో అతను తన ఎంట్రీని నమోదు చేయలేదు. కానీ, కొద్దిరోజుల క్రితమే వచ్చే సీజన్‌లో మళ్లీ వస్తానని ప్రకటన కూడా చేశాడు. గేల్ పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలతో ఆడాడు. కాగా, రీఎంటీ చేస్తే గేల్ తన మొదటి ఎంపిక RCB అంటూ పేర్కొన్నాడు.