AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup Final: చివరి ఇన్నింగ్స్‌లలో 0, 5, 12 మాత్రమే.. సూర్య రోహిత్ శర్మ కెప్టెన్సీ స్టైల్ ఫాలో అవుతున్నాడా?

Asia Cup 2025 :ఆసియా కప్ 2025 ఫైనల్‌కు భారత్ చేరుకున్నప్పటికీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవమైన బ్యాటింగ్ ఫామ్ అభిమానులు, నిపుణులకు పెద్ద చర్చనీయాంశంగా మారింది. శ్రీలంకతో జరిగిన సూపర్ ఓవర్‌లో విజయం సాధించడానికి కీలక పరుగులు చేసినా, మొదటి ఇన్నింగ్స్‌లో 13 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.

Asia Cup Final: చివరి ఇన్నింగ్స్‌లలో 0, 5, 12 మాత్రమే.. సూర్య రోహిత్ శర్మ కెప్టెన్సీ స్టైల్ ఫాలో అవుతున్నాడా?
Suryakumar Yadav
Rakesh
|

Updated on: Sep 28, 2025 | 9:43 AM

Share

Asia Cup Final: ఆసియా కప్ 2025 ఫైనల్‌కు భారత్ చేరుకున్నప్పటికీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవమైన బ్యాటింగ్ ఫామ్ అభిమానులకు తీవ్ర నిరుత్సాహాన్ని కల్పిస్తోంది. శ్రీలంకతో జరిగిన సూపర్ ఓవర్‌లో విజయం సాధించడానికి కీలక పరుగులు చేసినా, మొదటి ఇన్నింగ్స్‌లో 13 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. తన ఎల్బీడబ్ల్యూ నిర్ణయాన్ని రివ్యూకు పంపడం కూడా అతని పేలవమైన ఫామ్‌కు అద్దం పట్టింది. ఆసియా కప్‌లో అతని చివరి మూడు ఇన్నింగ్స్‌లలో అతను 0, 5, 12 పరుగులు మాత్రమే సాధించాడు.

మాజీ భారత క్రికెటర్ ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో సూర్యకుమార్‌కు మద్దతుగా నిలిచారు. భారత కెప్టెన్ అత్యంత అద్భుతమైన అధిక-రిస్క్ గేమ్ ఆడుతున్నాడు అని వ్యాఖ్యానించారు. “సూర్యకుమార్‌ విషయానికొస్తే కెప్టెన్సీ తర్వాత అతని యావరేజ్ పడిపోయిందని ప్రజలు అంటున్నారు. కానీ దానితో పాటు ఒక కొత్త బ్రాండ్ క్రికెట్ మొదలైంది. అతను 40 యావరేజ్ ఉండాలని నేను కోరుకోవడం లేదు. టీ20 క్రికెట్‌లో మనం ఎప్పుడూ ఈ యావరేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. కెప్టెన్‌గా సూర్య ఒక అధిక-రిస్క్ గేమ్ ఆడుతున్నాడు.. అది చాలా అద్భుతం” అని అశ్విన్ అన్నారు.

“రోహిత్ దీన్ని చూపించాడు, తన వికెట్‌కు ఎటువంటి విలువ ఇవ్వకుండా, ఎప్పుడూ దూకుడుగా ఆడటానికి కట్టుబడి ఉన్నాడు. సూర్య కూడా దీన్నే అనుసరిస్తున్నాడు. వేర్వేరు స్లాట్‌లలో వస్తున్నాడు. ఎప్పుడూ మూడో స్థానంలో కాదు” అని అశ్విన్ తెలిపారు.

ఈ ఏడాది పది ఇన్నింగ్స్‌లలో కేవలం 99 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందులో మూడు డక్ అవుట్‌లు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో అతని ఏకైక మంచి ఇన్నింగ్స్ పాకిస్థాన్‌తో గ్రూప్ దశలో వచ్చింది, అక్కడ అతను అజేయంగా 47* పరుగులు చేసి, ఒక సిక్సర్‌తో ఛేజింగ్ షాట్ కొట్టాడు.

సూర్యకుమార్ పాకిస్థాన్‌తో హ్యాండ్‌షేక్ వివాదం, మ్యాచ్ అనంతర పహల్గామ్ వ్యాఖ్యల కారణంగా కూడా వార్తల్లో నిలిచాడు. రెండు మ్యాచ్‌లలోనూ టాస్ సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అగాతో అతను చేతులు కలపలేదు. అతని సహచరులు కూడా ఇదే వైఖరిని అనుసరించి, మ్యాచ్ అనంతర హ్యాండ్ షేక్ నివారించారు.

సూర్యకుమార్‌కు జరిమానా విధించింది. అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించబడింది. అతను భారత్ గ్రూప్ స్టేజీలో విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం చేశాడు. దీనిపై పీసీబీ ఐసీసీకి ఒక ఈమెయిల్ పంపి, అతను రాజకీయ వ్యాఖ్యలు చేశాడని ఆరోపించింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..