AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: మ్యాచ్‌ గెలిచాక.. పాక్‌ జట్టు మొత్తానికి ఊహించని షాకిచ్చిన సూర్య భాయ్‌!

ఆసియా కప్ 2025లో యంగ్ టీమిండియా పాకిస్థాన్‌ను ఓడించింది. పహల్గామ్ దాడి తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో, సూర్యకుమార్ యాదవ్ పాక్ ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్ చేయకుండా నిరసన తెలిపాడు. ఈ విజయం భారత అభిమానులను సంతోషపరిచింది, కానీ సూర్యకుమార్ యాదవ్ చర్య వివాదాస్పదంగా మారింది.

IND vs PAK: మ్యాచ్‌ గెలిచాక.. పాక్‌ జట్టు మొత్తానికి ఊహించని షాకిచ్చిన సూర్య భాయ్‌!
2025 ఆసియా కప్ ఫైనల్‌కు భారత జట్టు ఇప్పటికే అర్హత సాధించింది. టైటిల్ కోసం జరిగే ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28 ఆదివారం దుబాయ్‌లో జరుగుతుంది. ఇప్పుడు భారత్ మరోసారి ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. టీమ్ ఇండియాకు ఓదార్పునిచ్చే విషయం ఏమిటంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడు.
SN Pasha
|

Updated on: Sep 15, 2025 | 12:08 AM

Share

ఆసియా కప్‌ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యంగ్‌ టీమిండియా సూపర్‌ విక్టరీ సాధించింది. పహల్గామ్‌ ఎటాక్‌ తర్వాత పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దనే డిమాండ్‌ వ్యక్తం అవుతున్నప్పటికీ బీసీసీఐ పాక్‌తో టీమిండియాను ఆడించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా అందరి అంచనాలు నిలబెడుతూ పాక్‌ను చిత్తు చేస్తూ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ గెలిచాక టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ పాక్‌ ఆటగాళ్లకు షాక్‌ ఇచ్చాడు.

సాధారణంగా ఈ మ్యాచ్‌ ఆడినా కూడా మ్యాచ్‌ ముగిశాక.. ఇరు జట్లు ఆటగాళ్లు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకుంటారు. కానీ, ఈ మ్యాచ్‌ తర్వాత నాటౌట్‌గా నిలిచిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే పాకిస్థాన్‌ ఆటగాళ్లతో హ్యాండ్‌ షేక్‌ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. మ్యాచ్‌ ముగియగా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌ వైపు నడక ప్రారంభించారు. ఇది ఒక రకమైన నిరసన అంటూ కొంతమంది సూర్యను అభినందిస్తున్నారు.

ఎందుకంటే పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి గురించి తెలిసిందే. అందుకే పాక్‌ ఆటగాళ్లతో భారత ఆటగాళ్ల షేక్‌ హ్యాండ్‌కు ముందుకు రాలేదు. టాస్‌ సమయంలో కూడా పాక్‌ కెప్టెన్‌కు సూర్య షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు. కేవలం ఫార్మాలిటీ కోసం ఈ మ్యాచ్‌ ఆడాం అంతే అన్నట్లు భారత ఆటగాళ్లు ‍వ్యవహరించాడు. కానీ, మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు చిత్తు చేసి భారత అభిమానులకు సంతోషం కలిగించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..