IND vs PAK: పాకిస్థాన్‌కు ఇచ్చిపడేసిన టీమిండియా..! సూర్య భాయ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్..
భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌పై అద్భుతమైన విజయం సాధించింది. బౌలర్లు పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేశారు. తక్కువ లక్ష్యం (128 పరుగులు)ను సులభంగా ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (47*), అభిషేక్ శర్మ (31), తిలక్ వర్మ (31) అద్భుతం గా రాణించారు.

ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బౌలర్లు పాకిస్థాన్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తే.. ఆ తర్వాత భారత బ్యాటర్లు పాక్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. మొత్తంగా 128 పరుగుల స్వల్ప టార్గెట్‌ను టీమిండియా చాలా సునాయాసంగా ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అలాగే అభిషేక్ శర్మ 31, తిలక్ వర్మ 31 పరుగులతో రాణించారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో టీమిండియా బౌలర్లకు వందశాతం క్రెడిట్ ఇవ్వాలి. చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. హార్ధిక్ పాండ్యా తొలి ఓవర్ తొలి బంతికే పాక్ ఓపెనర్ షైమ్ అయ్యూబ్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత బుమ్రా రెండో వికెట్ పడగొట్టాడు. మొత్తంగా కుల్దీప్ యాదవ్ 3, బుమ్రా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు, పాండ్యా, వరణ్ చక్రవర్తి చెరో వికెట్ తీసుకున్నారు. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ ఫర్‌హాన్ 40, షాహీన్ షా అఫ్రిదీ 33 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా భారత బౌలర్ల ముందు చేతులెత్తేశారు.
ఇక 128 పరుగుల స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా 15.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసి మ్యాచ్‌ను సింపుల్‌గా, వన్ సైడెడ్‌గా గెలిచేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 31 పరుగులు చేసి పాకిస్థాన్ బౌలర్లను వణికించాడు. మరో ఓపెనర్ గిల్ 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ 31 పరుగులతో రాణించాడు. చివర్లో శివమ్ దూబె ఓ సిక్స్‌తో 10 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో షైబ్ అయ్యూబ్‌కే మూడు వికెట్లు పడ్డాయి. మిగతా బౌలర్లు ఎవ్వరూ కూడా టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను ఇబ్బంది పెట్టలేకపోయారు.
2⃣ wins on the bounce for #TeamIndia! 🙌
A dominating show with bat & ball from Surya Kumar Yadav & Co. to bag 2 more points! 👏 💪
Scorecard ▶️ https://t.co/W2OEWMTVaY#AsiaCup2025 pic.twitter.com/hM7iin7AAq
— BCCI (@BCCI) September 14, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




