AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pakistan Highlights, Asia Cup Final: 9వసారి ట్రోఫీ గెలిచిన భారత్..

Asia Cup 2025, Ind vs Pak Final Highlights: ఆసియా కప్‌ 2025లో పాకిస్థాన్‌పై టీమిండియా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. టీం ఇండియా గతంలో గ్రూప్ దశలో, ఆ తర్వాత సూపర్ 4 రౌండ్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. తాజాగా ఫైనల్ మ్యాచ్‌లోనూ విజయం సాధించింది.

India vs Pakistan Highlights, Asia Cup Final: 9వసారి ట్రోఫీ గెలిచిన భారత్..
Ind Vs Pak
Venkata Chari
|

Updated on: Sep 29, 2025 | 12:17 AM

Share

India vs Pakistan Final Highlight, Asia Cup 2025, Todays Match Updates in Telugu: ఆసియా కప్‌ను భారత్ గెలుచుకుంది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన టీం ఇండియా. ఈ టోర్నమెంట్‌లో ఆ జట్టుకు ఇది తొమ్మిదవ టైటిల్ విజయం. ఆదివారం, భారత్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని 20వ ఓవర్ నాలుగో బంతికి చేరుకుంది. రింకు సింగ్ ఫోర్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. తిలక్ వర్మ 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 29 Sep 2025 12:05 AM (IST)

    9వ సారీ ట్రోఫీ మనదే

    ఆసియా కప్‌ను భారత్ గెలుచుకుంది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన టీం ఇండియా. ఈ టోర్నమెంట్‌లో ఆ జట్టుకు ఇది తొమ్మిదవ టైటిల్ విజయం.

    ఆదివారం, భారత్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని 20వ ఓవర్ నాలుగో బంతికి చేరుకుంది. రింకు సింగ్ ఫోర్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. తిలక్ వర్మ 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

  • 28 Sep 2025 11:39 PM (IST)

    తిలక్ హాఫ్ సెంచరీ..

    భారత్ 17 ఓవర్లలో 4 వికెట్లకు 117 పరుగులు చేసింది. తిలక్ వర్మ, శివం దూబే క్రీజులో ఉన్నారు. తిలక్ అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.

  • 28 Sep 2025 11:28 PM (IST)

    15 ఓవర్లలో..

    భారత్ 15 ఓవర్లలో 4 వికెట్లకు 100 పరుగులు చేసింది. తిలక్ వర్మ, శివం దుబే క్రీజులో ఉన్నారు.

  • 28 Sep 2025 11:14 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్

    77 పరుగుల వద్ద సంజూ శాంసన్ (24) ఔట్

  • 28 Sep 2025 11:11 PM (IST)

    శాంసన్ భారీ సిక్స్..

    సాయిమ్ అయూబ్ వేసిన బంతిని భారీ సిక్స్‌గా మలిచిన శాంసన్

    12 ఓవర్లలో భారత్‌ స్కోర్ 76/3

    తిలక్ వర్మ 34 , శాంసన్ 24

  • 28 Sep 2025 11:06 PM (IST)

    తిలక్‌ వర్మ సూపర్‌ సిక్స్‌..

    అహ్మద్‌ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచిన తిలక్ వర్మ

    10.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి భారత్‌ స్కోర్ 68 పరుగులు

    తిలక్ 32, శాంసన్ 18 పరుగులు

  • 28 Sep 2025 10:58 PM (IST)

    నిలకడగా ఆడుతున్న తిలక్ వర్మ, శాంసన్

    9.3 ఓవర్లలో భారత్‌ స్కోర్ 56/3

    తిలక్ వర్మ, 23(24), శాంసన్ 16(12)

  • 28 Sep 2025 10:54 PM (IST)

    50 పరుగులు పూర్తి చేసుకున్న భారత్

    8.1 ఓవర్‌లో 3 వికెట్ల నష్టానికి భారత్‌ స్కోర్ 50 పరుగులు

  • 28 Sep 2025 10:19 PM (IST)

    స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్తున్న తిలక్ వర్మ

    7.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి భారత్ స్కోర్ 47

    తిలక్ వర్మ 19 బంతుల్లో 20 పరుగులు

    సంజూ శాంసన్ 7 బంతుల్లో 11 పరుగులు

  • 28 Sep 2025 09:49 PM (IST)

    146 పరుగులకే పాక్ ఆలౌట్

    ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ భారత్ ముందు 147 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత్.. 19.1 ఓవర్లలో 146 పరుగులకు పాకిస్తాన్ ఆలౌట్ అయింది.

  • 28 Sep 2025 09:41 PM (IST)

    18 ఓవర్లలో..

    18 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 141 పరుగులు చేసింది. మహ్మద్ నవాజ్ క్రీజులో ఉన్నాడు.

  • 28 Sep 2025 09:34 PM (IST)

    కుల్దీప్ స్పిన్ మ్యాజిక్

    17 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 134 పరుగులు చేసింది. మహ్మద్ నవాజ్ క్రీజులో ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ తన నాలుగో ఓవర్ లో మూడు వికెట్లు సహా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

  • 28 Sep 2025 09:22 PM (IST)

    6వ వికెట్ డౌన్

    పాకిస్థాన్ 16.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.

  • 28 Sep 2025 09:09 PM (IST)

    3వ వికెట్ డౌన్

    పాకిస్తాన్ 13.3 ఓవర్లలో మూడు వికెట్లకు 114 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ క్రీజులో ఉన్నాడు.

  • 28 Sep 2025 08:59 PM (IST)

    100 దాటిన స్కోర్

    పాకిస్థాన్ 11.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్ క్రీజులో ఉన్నారు.

  • 28 Sep 2025 08:48 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన పాక్

    పాకిస్తాన్ 9.4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ క్రీజులో ఉన్నాడు.

    సాహిబ్‌జాదా ఫర్హాన్ 38 బంతుల్లో 57 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

  • 28 Sep 2025 08:30 PM (IST)

    ఐదు ఓవర్లలో..

    ఐదు ఓవర్లలో పాకిస్తాన్ వికెట్ కోల్పోకుండా 37 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ క్రీజులో ఉన్నారు.

    భారత్ తరఫున తొలి ఓవర్ శివం దూబే, రెండో ఓవర్ జస్ప్రీత్ బుమ్రా వేశారు.

  • 28 Sep 2025 07:57 PM (IST)

    పాకిస్తాన్ కెప్టెన్ ఫొటోను మార్చేసిన బీసీసీఐ

    బీసీసీఐ పోస్ట్ చేసిన మ్యాచ్ అప్డేట్ ఫొటోలో పాక్ కెప్టెన్ లేకుండా చేసింది. గిల్, సూర్యలతో పోస్ట్ చేసి షాకిచ్చింది.

  • 28 Sep 2025 07:50 PM (IST)

    గాయంతో హార్దిక్ ఔట్..

    గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఆడటం లేదు. అతని స్థానంలో రింకు సింగ్‌ను ప్లేయింగ్ 11లో చేర్చారు. పాకిస్తాన్ ప్లేయింగ్ 11లో ఎటువంటి మార్పులు లేవు.

  • 28 Sep 2025 07:36 PM (IST)

    భారత్ (ప్లేయింగ్ XI):

    అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

  • 28 Sep 2025 07:36 PM (IST)

    పాకిస్తాన్ ప్లేయింగ్ 11

    సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

  • 28 Sep 2025 07:32 PM (IST)

    టాస్ గెలిచిన భారత్..

    టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

  • 28 Sep 2025 06:55 PM (IST)

    Picth Report: పిచ్ నుంచి ఎవరికి సహాయం..?

    దుబాయ్ పిచ్ సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. అయితే, భారత్-శ్రీలంక మ్యాచ్‌లో, ఇది బ్యాటర్లకు మరింత సహాయాన్ని అందించింది. టైటిల్ పోరులో కూడా ఇలాంటి ప్రదర్శన ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఫైనల్‌లో అధిక రన్ రేట్‌కు దారితీసే అవకాశం ఉంది. ఈ పిచ్ ప్రారంభంలో బౌలర్లకు కూడా కొంత సహాయాన్ని అందిస్తుంది.

  • 28 Sep 2025 06:47 PM (IST)

    Virat Kohli: ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోన్న కోహ్లీ ‘3 పదాల’ పోస్ట్..!

    ఒక చిన్న పోస్ట్, అదీ కేవలం మూడు పదాల క్యాప్షన్‌తో 9 మిలియన్లకు పైగా లైక్‌లు సాధించడం విరాట్ కోహ్లీకి మాత్రమే సాధ్యమైంది. ఈ ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • 28 Sep 2025 06:40 PM (IST)

    IND vs PAK Final: స్టేడియంలో ఇవి నిషేధం..

    దుబాయ్ పోలీసులు ఫైనల్‌కు హాజరయ్యే అభిమానులకు అనేక హెచ్చరికలు జారీ చేశారు. అభిమానులు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లోపల జెండాలు, బ్యానర్లు లేదా బాణసంచా వంటి వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతించరు.

  • 28 Sep 2025 06:20 PM (IST)

    Pakistan: పాకిస్థాన్‌కు లక్కీ ఛాన్స్..

    2000, 2012లో టోర్నమెంట్ గెలిచిన పాకిస్తాన్ ఇప్పటివరకు రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.

  • 28 Sep 2025 06:00 PM (IST)

    Team India: 9వ టైటిల్‌పై కన్నేసిన టీమిండియా..

    ఇది 17వ ఆసియా కప్ ఎడిషన్. టీమిండియా తన తొమ్మిదో టైటిల్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018, 2023 సంవత్సరాల్లో భారత్ ఈ టైటిల్‌ను గెలుచుకుంది.

  • 28 Sep 2025 05:45 PM (IST)

    IND vs PAK: 30 ఏళ్ల తర్వాత హిస్టరీ రిపీట్..?

    1995 తర్వాత తొలిసారిగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా ఆసియా కప్ గెలుచుకునే అవకాశం భారత్‌కు లభిస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా భారత్ చివరిసారిగా 1995లో ఆసియా కప్ గెలిచింది. ఆ సమయంలో, ఇద్దరు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి కూడా అడుగుపెట్టలేదు.

  • 28 Sep 2025 05:21 PM (IST)

    28వ తేదీకి ప్రత్యేక కనెక్షన్..

    గత 28వ తేదీన భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలో భారత జట్టు అద్భుతంగా రాణించింది. తొలిసారి 2012లో, డిసెంబర్ 28న రెండు జట్లు టీ20 మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆ తర్వాత, ఆగస్టు 28న జరిగిన 2022 ఆసియా కప్ టీ20 మ్యాచ్‌లో భారత్ మళ్లీ గెలిచింది.

  • 28 Sep 2025 05:00 PM (IST)

    ఫైనల్లో అభిషేక్ సెంచరీ చేస్తే?

    Asia Cup 2025 Final: అభిషేక్ శర్మ సెంచరీ సాధిస్తే, ఆసియా కప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా, టీ20 ఆసియా కప్ చరిత్రలో నాల్గవ ఆటగాడిగా అతను రికార్డు సృష్టించగలడు. ఫైనల్‌లో ఒక బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక స్కోరు 71, ఇది శ్రీలంకకు చెందిన భానుక రాజపక్సే పేరిట ఉంది.

  • 28 Sep 2025 04:45 PM (IST)

    పాండ్యా ఖాతాలో అరుదైన రికార్డ్..

    Asia Cup 2025, Ind vs Pak Final Updates: పాకిస్థాన్‌తో జరిగే ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా సెంచరీ సాధించే అవకాశం ఉంది. అయితే, ఈ సెంచరీ బ్యాట్‌తో కాదు, బంతితో సాధించనున్నాడు. పాండ్యా తన 100వ T20I వికెట్‌కు కేవలం రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. అతను ఈ ఘనత సాధిస్తే, అర్ష్‌దీప్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ ఆటగాడిగా అతను నిలుస్తాడు.

  • 28 Sep 2025 04:30 PM (IST)

    ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ రికార్డులు..

    India vs Pakistan Final: ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు మొత్తం మీద 22వ సారి తలపడనున్నాయి. గతంలో జరిగిన 21 మ్యాచ్‌లలో భారత్ 12 మ్యాచ్‌లలో విజయం సాధించగా, పాకిస్తాన్ 6 మ్యాచ్‌లలో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

  • 28 Sep 2025 04:10 PM (IST)

    13వ సారి పోరు

    India vs Pakistan Final: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టోర్నమెంట్ ఫైనల్‌లో తలపడటం ఇది 13వ సారి. గతంలో జరిగిన 12 టోర్నమెంట్ ఫైనల్స్‌లో పాకిస్తాన్ ఎనిమిదింటిని గెలుచుకోగా, ఇండియా నాలుగు గెలిచింది.

  • 28 Sep 2025 03:50 PM (IST)

    ఇండియా-పాకిస్తాన్ ఫైనల్ ప్లేయింగ్ 11..!

    ఆసియా కప్ 2025 ఫైనల్: ఫైనల్ కోసం భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండవచ్చు.

    భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, సంజు శాంసన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా.

    పాకిస్థాన్: ఫఖర్ జమాన్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్, సల్మాన్ అఘా, ఫహీమ్ అష్రఫ్, మహ్మద్ హారీస్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

  • 28 Sep 2025 03:32 PM (IST)

    భారత్ – పాకిస్తాన్ ఫైనల్..

    India vs Pakistan Live Score: ఆసియా కప్ 2025 లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు టాస్ వేయనున్నారు.

Published On - Sep 28,2025 3:31 PM

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!