
ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన తొలి మ్యాచ్ ఇప్పటికే రద్దయింది. కొలంబో నుంచి సూపర్- 4 మ్యాచ్‌లను తరలిస్తున్నారని వార్తలు వచ్చినా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కొట్టిపారేసింది. కొలంబోలోనే మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికీ కొలంబోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సెప్టెంబర్ 10న జరగనున్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆదివారం (సెప్టెంబర్ 10) కొలంబోలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 10 ఉదయం కొలంబోలో 70 శాతం వర్షం పడే అవకాశముందని అక్కడి వాతావరణ నిపుణులు అంచనా వేస్త్ఉన్నారు.ఇక మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో వర్షం మరింత పెరగవచ్చని క్రమంగా, ఇక రాత్రివేళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటే మ్యాచ్ ఎలా జరుగుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్స్‌మెన్‌లు కూడా ఏమీ చేయలేరా? ఫలితంగా, ఆసియా కప్ 2023లో భారత్- పాకిస్థాన్ మధ్య వరుసగా రెండో మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది . అయితే కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాక్ మ్యాచ్‌పైనే కాదు. ఇదే వేదికలో జరగనున్న మరో రెండు భారత మ్యాచ్‌లపై కూడా వర్షం ప్రభావం చూపే అవకాశముంది.
సెప్టెంబర్ 12న ఇక్కడ జరగనున్న భారత్-శ్రీలంక మ్యాచ్‌కి వర్షం ముప్పు పొంచి ఉంది. ఆ రోజు కొలంబోలో 40 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే సెప్టెంబర్ 15న బంగ్లాదేశ్‌తో భారత్ ఆడనున్న మ్యాచ్‌లో మిగతా రోజులతో పోలిస్తే కాస్త అనుకూల వాతావరణం ఉండనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆసియా కప్‌లో టీమిండియాను విలన్‌లా వరుణుడు వెంటపడుతున్నాడు. కాగా గ్రూప్ మ్యాచ్‌లు ముగియడంతో నేటి నుంచి సూపర్ 4 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..