Asia Cup 2023 Live Streaming: ఉచితంగానే ఆసియా కప్ 2023 మ్యాచ్‌లు చూడొచ్చు.. కానీ, ఓ కండీషన్..

Asia Cup 2023 Full Schedule, Squads, Live streaming Details: ఈ ఏడాది ఆసియా కప్‌ను 'హైబ్రిడ్ మోడల్'లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆగస్ట్ 30న ముల్తాన్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌తో నేపాల్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌ ఫోర్‌ దశకు చేరుకుంటాయి.

Asia Cup 2023 Live Streaming: ఉచితంగానే ఆసియా కప్ 2023 మ్యాచ్‌లు చూడొచ్చు.. కానీ, ఓ కండీషన్..
Asia Cup Live Straming
Follow us
Venkata Chari

|

Updated on: Aug 29, 2023 | 1:30 PM

Asia Cup 2023 Live Streaming and Broadcast: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2023 టోర్నమెంట్ (Asia Cup 2023) బుధవారం ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆసియా కప్‌ను ‘హైబ్రిడ్ మోడల్’లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆగస్ట్ 30న ముల్తాన్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌తో నేపాల్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌ ఫోర్‌ దశకు చేరుకుంటాయి. చివరగా, సూపర్ ఫోర్ నుంచి మొదటి రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి.

ఆసియా కప్ 2023 లైవ్ స్ట్రీమింగ్..

ఆసియా కప్ 2023 ఉచితంగా చూడొచ్చు. Disney+Hotstar హక్కులను సొంతం చేసుకుంది. Disney+Hotstar మొబైల్ యాప్ ద్వారా ఆసియా కప్ మొత్తం టోర్నమెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఈ ప్రత్యక్ష ప్రసారాలు మొబైల్ యాప్‌నకు మాత్రమే పరిమితం చేశారు. పెద్ద స్క్రీన్‌పై ప్రత్యక్షంగా చూడటానికి సభ్యత్వం అవసరం.

ఇవి కూడా చదవండి

భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, మాల్దీవులు, భూటాన్‌తో సహా దాని పొరుగు దేశాలలో ఆసియా కప్ 2023 ప్రత్యక్ష ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ కొనుగోలు చేసింది. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1 హెచ్‌డీతో సహా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో ఆసియా కప్ టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ సెప్టెంబర్ 2న క్యాండీలోని పల్లెకెల్లె అంతర్జాతీయ స్టేడియంలో బాబర్ ఆజం నేతృత్వంలోని చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. గ్రూప్‌-ఏలో చోటు దక్కించుకున్న భారత్‌, సెప్టెంబర్‌ 4న క్యాండీలో నేపాల్‌తో రెండో మ్యాచ్‌ ఆడనుంది.

ఆసియా కప్ 2023 షెడ్యూల్..

ఆగస్టు 30: పాకిస్థాన్ vs నేపాల్, ముల్తాన్, మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఆగస్టు 31: బంగ్లాదేశ్ vs శ్రీలంక, క్యాండీ, మధ్యాహ్నం 3 గంటలకు

సెప్టెంబర్ 2: పాకిస్థాన్ vs ఇండియా, క్యాండీ, మధ్యాహ్నం 3 గంటలకు

సెప్టెంబర్ 3: బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్, లాహోర్, మధ్యాహ్నం 2:30 గంటలకు

సెప్టెంబర్ 4: భారత్ vs నేపాల్, క్యాండీ, మధ్యాహ్నం 3 గంటలకు

సెప్టెంబర్ 5: శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్, లాహోర్, మధ్యాహ్నం 2:30 గంటలకు

సెప్టెంబర్ 6: A1 vs B2, లాహోర్, మధ్యాహ్నం 2:30 గంటలకు

సెప్టెంబర్ 9: B1 vs B2, కొలంబో, 3 గంటలకు

సెప్టెంబర్ 10: A1 vs A2, కొలంబో, మధ్యాహ్నం 3 గంటలకు

సెప్టెంబర్ 12: A2 vs B1, కొలంబో, 3 గంటలకు

సెప్టెంబర్ 14: A1 vs B1, కొలంబో, 3 గంటలకు

సెప్టెంబర్ 15: A2 vs B2, కొలంబో, 3 గంటలకు

సెప్టెంబర్ 17: ఫైనల్, కొలంబో, మధ్యాహ్నం 3 గంటలకు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..