Team India: పాక్‌ను వణికించిన భారత కెప్టెన్లు వీరే.. అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో ఎవరున్నారో తెలుసా?
India vs Pakistan ODI Records: సెప్టెంబర్ 2న శ్రీలంక వేదికగా దాయాదుల పోరు జరగనుంది. ఆసియా కప్ 2023 రేపటి నుంచి మొదలుకానుంది. ఈ క్రమంలో ఈసారి రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా పాకిస్తాన్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. కాగా, ఇప్పటి వరకు పాకిస్తాన్ జట్టుపై అత్యధికంగా విజయాలు అందుకున్న భారత సారథుల గురించి తెలుసుకుందాం.. ఈ లిస్టులో మహేంద్ర సింగ్ ధోని అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో నిలిచాడు.
India vs Pakistan ODI Records: టోర్నీ ఏదైనా, మ్యాచ్ ఎక్కడైనా ప్రపంచ మంతా ఆసక్తిగా చూడాలనుకునేది భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాయాదుల పోరు కోసం ప్రపంచం అంతా స్తంభించిపోతుంది. ఇలాంటి పోరు సెప్టెంబర్ 2న శ్రీలంక వేదికగా జరగనుంది. ఆసియా కప్ 2023 రేపటి నుంచి మొదలుకానుంది. ఈ క్రమంలో ఈసారి రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా పాకిస్తాన్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. కాగా, ఇప్పటి వరకు పాకిస్తాన్ జట్టుపై అత్యధికంగా విజయాలు అందుకున్న భారత సారథుల గురించి తెలుసుకుందాం.. ఈ లిస్టులో మహేంద్ర సింగ్ ధోని అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఎంఎస్ ధోని: మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీమిండియా పాకిస్తాన్‌తో 18 వన్డేలు ఆడింది. ఇందులో భారత్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాకిస్థాన్‌పై కెప్టెన్‌గా ధోనీ సాధించిన విజయాల శాతం 61.10గా నిలిచింది.
మహ్మద్ అజారుద్దీన్: మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కెప్టెన్సీలో పాకిస్థాన్‌తో భారత్ 25 వన్డేలు ఆడింది. అందులో భారత జట్టు 9 గెలిచి, 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కెప్టెన్‌గా పాకిస్థాన్‌పై అజారుద్దీన్ సాధించిన విజయాల శాతం 36గా నిలిచింది.
సచిన్ టెండూల్కర్: సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో భారత జట్టు పాకిస్థాన్‌తో 21 వన్డేలు ఆడింది. ఇందులో భారత్ 8 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. 11 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 2 మ్యాచ్‌ల ఫలితం తేలలేదు.
సమరానికి సిద్ధమైన భారత జట్టు..
Prep mode 🔛
Energy levels high 💪
Getting into the groove in Alur 👌#TeamIndia | #AsiaCup2023 pic.twitter.com/rHBZzbf4WT
— BCCI (@BCCI) August 29, 2023
సౌరవ్ గంగూలీ: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో భారత్ పాకిస్థాన్‌తో 17 వన్డేలు ఆడింది. అందులో జట్టు 7 గెలిచి, 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
రాహుల్ ద్రవిడ్: ద్రవిడ్ కెప్టెన్సీలో భారత్ పాకిస్థాన్‌తో 9 వన్డేలు ఆడింది. అందులో భారత జట్టు 5 గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
కపిల్ దేవ్: ప్రపంచ కప్ అందించి, హీరోగా నిలిచిన కపిల్ కెప్టెన్సీలో భారత్ పాకిస్తాన్‌తో 13 మ్యాచ్‌లు ఆడింది. అందులో జట్టు 4 గెలిచింది, 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
సునీల్ గవాస్కర్: సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ పాకిస్థాన్‌తో 7 వన్డేలు ఆడింది. 4 మ్యాచ్‌లు గెలిచింది. 3 మ్యాచ్‌లు ఓడిపోయింది.
ఆసియా కప్ బరిలో నిలిచే భారత జట్టు..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..