Asia Cup: 35 ఏళ్ల వన్డే ఆసియాకప్ చరిత్రలో ఒకే ఒక్క భారతీయుడు.. మరెవ్వరికి సాధ్యం కాని ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?

Asia Cup Stats: వన్డే ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్‌ను గెలిచి నంబర్ వన్ టీంగా వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే వన్డే ఆసియాకప్‌లో భారత బౌలర్ల రికార్డు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వన్డే ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఒకే ఒక్క భారత బౌలర్ ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. కాగా, ఆసియా కప్ 2023 రేపటి నుంచి మొదలుకానుంది. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థుల పోరు కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Asia Cup: 35 ఏళ్ల వన్డే ఆసియాకప్ చరిత్రలో ఒకే ఒక్క భారతీయుడు.. మరెవ్వరికి సాధ్యం కాని ఆ స్పెషల్ రికార్డ్ ఏంటంటే?
Asia Cup India Team
Follow us
Venkata Chari

|

Updated on: Aug 29, 2023 | 12:46 PM

Asia Cup Records and Stats: ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి ప్రారంభమవుతుంది. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్‌ను గెలిచి నంబర్ వన్ టీంగా వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే వన్డే ఆసియాకప్‌లో భారత బౌలర్ల రికార్డు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వన్డే ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఒకే ఒక్క భారత బౌలర్ ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు.

ఒకే ఒక్కడు ‘అర్షద్ అయూబ్’..

35 ఏళ్ల క్రితం 1988లో భారత్ తరపున వన్డే ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్ అర్షద్ అయూబ్ 5 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అర్షద్ 9 ఓవర్లలో 21 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా గెలిచింది. ఆ తర్వాత ఆసియాకప్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా అర్షద్ అరుదైన ఘనత సాధించాడు. అయితే ఆ తర్వాత, భువనేశ్వర్ కుమార్ టీ20 ఆసియా కప్‌లో భారత్ తరపున ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ ఈ ఘనత సాధించాడు.

ఇవి కూడా చదవండి

అర్షద్ అయూబ్ రికార్డ్..

లసిత్ మలింగ పేరిట భారీ రికార్డ్..

వన్డే ఆసియా కప్‌లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ రికార్డు సృష్టించాడు. మూడు సార్లు ఈ ఘనత సాధించాడు. అదే సమయంలో 9 మంది బౌలర్లు ఈ ఘనత సాధించారు.

వన్డే ఆసియా కప్‌లో ఒక మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన బౌలర్లు వీరే..

లసిత్ మలింగ (శ్రీలంక) – 3 సార్లు

అజంతా మెండిస్ (శ్రీలంక) – 2 సార్లు

అర్షద్ అయూబ్ (భారతదేశం) – 1 సారి

అకిబ్ జావేద్ (పాకిస్తాన్) – 1 సారి

సక్లైన్ ముస్తాక్ (పాకిస్తాన్) – 1 సారి

సోహైల్ తన్వీర్ (పాకిస్థాన్) – 1 సారి

ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 1 సారి

పర్వేజ్ మహరూఫ్ (శ్రీలంక) – 1 సారి

తిసార పెరీరా (శ్రీలంక) – 1 సారి.

ఆసియా కప్ మ్యాచ్‌ల వివరాలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..