
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్-2023లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. భారత్-నేపాల్ జట్ల మధ్య జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గౌతమ్ గంభీర్ చర్య సర్వత్రా తీవ్ర దుమారం రేపుతోంది. మ్యాచ్ సమయంలో గంభీర్ మైదానం నుండి బయటకు వెళుతున్నప్పుడు.. ప్రేక్షకులు కోహ్లీ-కోహ్లీ అని అరిచారని, కోపోద్రిక్తుడైన గంభీర్ ప్రేక్షకులపై వేలితో అసభ్యకర సంజ్ఞ చేశాడని వార్తలు వచ్చాయి. వేలు చూపిస్తూ గంభీర్ సైగలు చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ వివాదంపై గంభీర్ పూర్తిగా క్లారిటీ ఇచ్చాడు. ‘ సో షల్ మీడియాలో మొత్తం నిజం చూపించలేదు. నేను వస్తున్నప్పుడు కొంతమంది ప్రేక్షకులు హిందుస్థాన్ ముర్దాబాద్, కశ్మీర్ అంటూ నినాదాలు చేశారు. అందుకే నేను అలాంటి రెస్పాన్స్ ఇచ్చాను. సోషల్ మీడియాలో చూపించేవి నిజం కాదు. ఎందుకంటే మనుషులు తమకు నచ్చిన విషయాలను మాత్రమే చూపిస్తారు. అక్కడి ప్రేక్షకులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే చాలా మంది కశ్మీర్ గురించి మాట్లాడారు. ఇద్దరు ముగ్గురు పాకిస్థానీలు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. హిందుస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. నేను నా దేశం గురించి ఇలాంటి మాటలు వినలేను. నేను అలాంటి వాటిని చూసి నవ్వేవాడిని కాదు. అందుకే అలాంటి రెస్పాన్స్ ఇచ్చాను’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
అదే సమయంలో అలాంటి వారికి ఏం సమాధానం చెబుతానన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ప్రజలు మ్యాచ్ చూసేందుకు వచ్చినప్పుడు తమ జట్టును ఆదరించాలని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని’ క్రికెట్ అభిమానులకు గంభీర్ సలహా ఇచ్చాడు. కాగా ఆసియాకప్ సూపర్-4 మ్యాచ్‌లు బుధవారం (సెప్టెంబర్ 6) నుంచి ప్రారంభం కానున్నాయి. లాహొర్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఇక క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆదివారం ( సెప్టెంబర్ 10)న జరగనుంది. కొలంబో వేదికగానే ఈ మ్యాచ్ జరగనుంది.
GAUTAM Gambhir Showed middle finger to kohli – kohli chants!🥵#IndvsNeppic.twitter.com/9qthyDDxQn
— ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) September 4, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..