ఆసియా కప్ తొలి మ్యాచ్‌కి టీమిండియా ఇదే.. తెలుగోడికి మొండిచెయ్యే.. ఐదు స్థానాలకు 11 మంది పోటీ.!

వెస్టిండీస్‌ పర్యటనతో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మకు కూడా ఆసియా కప్ టోర్నమెంట్‌లో చోటు దక్కింది. అలాగే గాయం కారణంగా ఆటకు దూరమైన ప్రసిద్ద్ కృష్ణ కూడా ప్రాబబుల్స్‌లో ఉండటం గమనార్హం. విండీస్ పర్యటనలో ఫ్లాప్ షో కనబరిచిన సంజూ శాంసన్‌ను బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ.

ఆసియా కప్ తొలి మ్యాచ్‌కి టీమిండియా ఇదే.. తెలుగోడికి మొండిచెయ్యే.. ఐదు స్థానాలకు 11 మంది పోటీ.!
Team India
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 26, 2023 | 4:25 PM

ఆసియా కప్ 2023 కోసం టీమిండియా 17 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా గాయం కారణంగా దూరమైన బౌలర్ జస్ప్రిత్ బుమ్రా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ తిరిగి జట్టులోకి పునరాగమనం చేశారు. అలాగే వెస్టిండీస్‌ పర్యటనతో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మకు కూడా ఆసియా కప్ టోర్నమెంట్‌లో చోటు దక్కింది. అలాగే గాయం కారణంగా ఆటకు దూరమైన ప్రసిద్ద్ కృష్ణ కూడా ప్రాబబుల్స్‌లో ఉండటం గమనార్హం. విండీస్ పర్యటనలో ఫ్లాప్ షో కనబరిచిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ సంజూ శాంసన్‌ను బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ. మరోవైపు యుజ్వేంద్ర చాహల్ ఉద్వాసన.. అటు ఫ్యాన్స్.. ఇటు మాజీ క్రికెటర్లను సైతం షాక్‌కు గురి చేసింది.

ఇదిలా ఉండగా.. బీసీసీఐ ప్రకటించిన జట్టును ఒకసారి పరిశీలిస్తే.. తుది జట్టులోకి దాదాపు ఆరుగురు ప్లేయర్స్ ఎంట్రీ ఖరారు అయిపోగా.. మిగిలిన ఐదు స్థానాల కోసం ఏకంగా 11 మంది ప్లేయర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. మరి ఇంతకీ ఆ ఆరుగురు ఎవరంటారో తెలుసా.? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శుభ్‌మాన్ గిల్, జస్ప్రీట్ బుమ్రా.. ఈ ఆరుగురు ఆటగాళ్లు ఆసియా కప్‌లో జరిగే ప్రతీ మ్యాచ్‌లోనూ భాగం కానున్నారు. ఇక మిగిలున్న ఐదు స్థానాల కోసం ఏకంగా 11 మంది ప్లేయర్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణలు తుది జట్టులో చోటు కోసం గట్టి పోటీని ఎదుర్కోనున్నారు. దాదాపుగా కెఎల్ రాహుల్ మ్యాచ్‌లో ఆడితే.. ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం కావచ్చు. అలాగే బుమ్రాతో పాటు సిరాజ్, షమీ పేస్ బౌలింగ్‌ బాధ్యతలు చేపడతారు. ఇక ఐదుగురు బ్యాటర్లు, ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్ల ఫార్ములాతో టీమిండియా బరిలోకి దిగితే.. కచ్చితంగా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది.

మరి కొన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..