AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రయాన్-3 దెబ్బకు కింగ్ కోహ్లీ రికార్డు బ్రేక్.. మరెవ్వరూ చేరుకోలేని రేర్ ఫీట్.! అదేంటంటే?

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును.. మన చంద్రయాన్-3 బ్రేక్ చేసింది. అదేంటి..? అసలు ఇదెలా సాధ్యం అని అనుమానం మీకు రావచ్చు. వెయిట్.. ఈ స్టోరీ చదవండి మీకే అర్ధమవుతుంది. కోహ్లీ రికార్డు బద్దలైంది గ్రౌండ్‌లో కాదు.. ట్విట్టర్‌లో.. ఇది బ్రేక్ అయింది.

చంద్రయాన్-3 దెబ్బకు కింగ్ కోహ్లీ రికార్డు బ్రేక్.. మరెవ్వరూ చేరుకోలేని రేర్ ఫీట్.! అదేంటంటే?
Virat Kohli
Ravi Kiran
|

Updated on: Aug 26, 2023 | 8:22 PM

Share

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును.. మన చంద్రయాన్-3 బ్రేక్ చేసింది. అదేంటి..? అసలు ఇదెలా సాధ్యం అని అనుమానం మీకు రావచ్చు. వెయిట్.. ఈ స్టోరీ చదవండి మీకే అర్ధమవుతుంది. కోహ్లీ రికార్డు బద్దలైంది గ్రౌండ్‌లో కాదు.. ట్విట్టర్‌లో.. ఇది బ్రేక్ అయింది. సరిగ్గా 10 నెలల క్రితం అంటే.. 2022 టీ20 ప్రపంచకప్ సమయంలో పాకిస్తాన్‌పై విజయం సాధించిన అనంతరం కోహ్లీ ఒక ట్వీట్ చేశాడు. ఇక ఇప్పుడు ఆ ట్వీట్‌కు సంబంధించిన రికార్డు చంద్రయాన్-3 బద్దలు కొట్టింది. అలాగే చంద్రయాన్ 3కి సంబంధించిన ట్వీట్‌ను ఏకంగా 55.3 మిలియన్ వ్యూయర్స్ చూడటం విశేషం.

చంద్రయాన్-3 ట్వీట్..

చంద్రుడి ఉపరితలంపై ‘చంద్రయాన్ 3’ సురక్షితంగా ల్యాండ్ అయ్యాక.. ‘నేను నా లక్ష్యాన్ని చేరుకున్నా’ అంటూ చంద్రయాన్ 3 ఇచ్చిన సందేశాన్ని ‘ఇస్రో’ సరిగ్గా 3 రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. ఇక ఇప్పుడు ఆ ట్వీట్ భారత్‌లో అత్యధిక లైకులు(840.1k) పొందిన ట్వీట్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్పటివరకు టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై విజయం తర్వాత విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ అత్యధిక లైకులు(796.2k) పొందిన ట్వీట్‌గా ఉండగా.. ఆ రికార్డును ఇస్రో ట్వీట్ ఇటీవల బ్రేక్ చేసింది. తద్వారా కింగ్ కోహ్లీ రికార్డును చంద్రయాన్ 3 సునాయాసంగా బ్రేక్ చేసిందనమాట. ప్రస్తుతం ఈ రికార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

విరాట్ కోహ్లీ ట్వీట్..

2022 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై మ్యాచ్ గెలిచిన అనంతరం కోహ్లీ చేసిన ఈ ట్వీట్ కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. 50 మిలియన్ల కంటే ఎక్కువ మంది దీన్ని వీక్షించడమే కాకుండా.. అత్యధికంగా ఇష్టపడిన ట్వీట్‌గా రికార్డు సృష్టించింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ చివరి వరకు క్రీజులో నిలబడి.. అజేయంగా 82 పరుగులు చేసి.. భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. గేమ్ గెలిచిన తర్వాత, తన అభిమానుల కోసం ఒక ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేసి, “ప్రత్యేక విజయం. హోరెత్తిన మీ అభిమానానికి ధన్యవాదాలు. ” అంటూ చేసిన కోహ్లీ ట్వీట్‌కు 796K లైక్‌లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇస్రో పోస్ట్‌కి 800K లైక్‌లు దాటడంతో.. రికార్డు చంద్రయాన్-3 వశం అయింది.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!