Viral Video: బంగ్లాదేశ్‌ ఓడిపోయిందని బోరున ఏడ్చేసిన బుడ్డోడు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో

Asia Cup 2022: దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌ టోర్నీలో బంగ్లాదేశ్‌ ఇంటి దారి పట్టింది. గురువారం శ్రీలంకతో గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఆజట్టు 2 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

Viral Video: బంగ్లాదేశ్‌ ఓడిపోయిందని బోరున ఏడ్చేసిన బుడ్డోడు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Asia Cup 2022
Follow us
Basha Shek

|

Updated on: Sep 02, 2022 | 4:14 PM

Asia Cup 2022: దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌ టోర్నీలో బంగ్లాదేశ్‌ ఇంటి దారి పట్టింది. గురువారం శ్రీలంకతో గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఆజట్టు 2 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో శ్రీలంక సూపర్‌-4 రౌండ్‌కు దూసుకెళ్లగా.. బంగ్లేయులు మాత్రం టోర్నీ నుంచి నిష్ర్కమించారు. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆ తర్వాత శ్రీలంక జట్టు ఈ లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. కాగా ఒకనొక దశలో ఈ మ్యాచ్‌లో గెలిపించేలా కనిపించిన బంగ్లా స్వీయ తప్పిదాలతో ఓటమిపాలైంది. దీంతో బంగ్లా ప్లేయర్లు భారంగా మైదానం వీడారు.

కాగా ఈ మ్యాచ్‌లో బం‍గ్లా ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. స్టేడియంలో ‍ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించిన అభిమానుల్లో చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈక్రమంలో ఓ బుడ్డోడు అయితే తీవ్ర ఎమోషనల్‌ అయ్యాడు. బంగ్లా జెర్సీలో ఉన్న ఆ బాలుడు ఏడుస్తూ కనిపించాడు. దీంతో పక్కన ఉన్న అతని తల్లి ఓదారుస్తూ కనిపించింది. ఇక తమ జట్టు గెలుస్తుందనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ఓటమి పాలు కావడం ఆ పిల్లాడిని కలచివేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా బంగ్లా క్రికెట్‌ ఫ్యాన్స్ ఇలా చేయడం ఇదేమి మొదటిసారేమీ కాదు.. గతంలోనూ ఆ జట్టు ఓడిపోయిన పలు సందర్భాల్లో అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..