Viral Video: సిక్స్ ప్యాక్‌తో దుబాయ్ బీచుల్లో సందడి చేసిన కోహ్లీ.. టీమిండియా క్రికెటర్ల ఫన్ డే వీడియో వైరల్
Asia Cup 2022: దుబాయి వేదికగా జరుగుతోన్న ఆసియాకప్‌లో టీమిండియా అదరగొడుతోంది. గ్రూప్-ఏలో భాగంగా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లోనూ గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో పాక్‌పై 5 వికెట్ల విజయం సాధించిన భారత జట్టు, ఆ తర్వాత హాంకాంగ్‌ను 40 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
Asia Cup 2022: దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఆసియాకప్‌లో టీమిండియా అదరగొడుతోంది. గ్రూప్-ఏలో భాగంగా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లోనూ గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో పాక్‌పై 5 వికెట్ల విజయం సాధించిన భారత జట్టు, ఆ తర్వాత హాంకాంగ్‌ను 40 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలవడంతో పాటు సూపర్-4 రౌండ్‌కు దూసుకెళ్లింది. కాగా నేటి సాయంత్రం పాక్- హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సూపర్-4లో భారత్ తలపడనుంది. కాగా సూపర్ 4 రౌండ్ మ్యాచ్‌లకు ఇంకా చాలా సమయం ఉండడంతో టీమిండియా క్రికెటర్లు దుబాయ్ అందాలను ఆస్వాదిస్తున్నారు. బీచ్‌ల్లో కలియ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, యుజువేంద్ర చాహల్, రవి బిష్ణోయ్.. ఇలా జుట్టు మొత్తం దుబాయ్ బీచుల్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను బీసీసీఐ అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేయగా, అవి కాస్తా వైరల్‌గా మారాయి.
When #TeamIndia hit ?.?.?.?.?.?! ?
ఇవి కూడా చదవండిTime for some surf, sand & beach volley! ?#AsiaCup2022 pic.twitter.com/cm3znX7Ll4
— BCCI (@BCCI) September 2, 2022
ఈ వీడియోల్లో కొందరు క్రికెటర్లు బీచ్ వాలీబాల్ ఆడుతూ కనిపించారు. ఇక హిట్‌మ్యాన్ కయాకింగ్ చేస్తూ దర్శనమిచ్చాడు. ఇక విరాట్ కోహ్లీ అయితే షర్ట్ విప్పేసి సహచరులతో వాలీబాల్ ఆడుతూ హంగామా చేశాడు. అలాగే సముద్రపు అలలపై సర్ఫింగ్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. ఇక రాహుల్, భువనేశ్వర్, అర్ష్‌దీప్‌లాంటి వాళ్లు కూడా సర్ఫింగ్ బోర్డులపైకి ఎక్కి సముద్రంలోకి వెళ్లారు. స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ అశ్విన్‌తో కలిసి ట్రైసైకిల్ పెడల్ బోట్‌లో విహరించాడు. ‘ప్రాక్టీస్‌కు హాలిడే కాబట్టి ద్రవిడ్ సార్ మాకోసం కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో మేం చాలా ఉత్సాహంగా పాల్గొని రిఫ్రెష్ అయ్యాం. మేం చాలా ఎంజాయ్ చేశాం’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు చాహల్.
Fun time for Indian players. pic.twitter.com/sZEu8mt610
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 2, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..