AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : 400 పరుగులు.. 167 బంతులు.. వైభవ్ విధ్వంసానికి స్టార్ ప్లేయర్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఫిదా

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటతీరుకు అర్ష్‌దీప్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్ సమ్రీన్ కౌర్ ఫిదా అయ్యారు. మ్యాచ్ ముగిశాక ఆమె నేరుగా వైభవ్ దగ్గరకు వెళ్లి అతడితో చాలా సేపు ముచ్చటించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

Vaibhav Suryavanshi : 400 పరుగులు.. 167 బంతులు.. వైభవ్ విధ్వంసానికి స్టార్ ప్లేయర్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఫిదా
Vaibhav
Rakesh
|

Updated on: May 01, 2026 | 11:41 AM

Share

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 వేదికగా ఒక కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. 15 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచ క్రికెట్‌ను తనవైపు తిప్పుకున్న బీహార్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన ఈ కుర్రాడు, మైదానంలో పరుగుల వరద పారిస్తూ దిగ్గజాలకే షాకిస్తున్నాడు. కేవలం తన బ్యాటింగ్‌తోనే కాదు, మ్యాచ్ తర్వాత జరిగే సందడిలో కూడా ఈ బుడ్డోడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా ఒక ఆసక్తికరమైన ఘటన సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

ఈ ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కనుగొన్న అద్భుత రత్నం వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే అత్యంత వేగంగా 400 పరుగులు (167 బంతుల్లో) పూర్తి చేసి ప్రపంచ రికార్డును తిరగరాశాడు. చిన్న వయసులోనే అంతటి పరిణితితో బ్యాటింగ్ చేస్తున్న వైభవ్‌ను చూసి క్రికెట్ విశ్లేషకులు ఫ్యూచర్ టీమిండియా స్టార్ అని పిలుస్తున్నారు. ఈ కుర్రాడి విధ్వంసక బ్యాటింగ్ చూసి స్టేడియంలో ఉన్న వారంతా సీట్లలోంచి లేచి మరీ చప్పట్లు కొట్టారు.

పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన హోరాహోరీ పోరు తర్వాత అసలు కథ మొదలైంది. టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్, మోడల్ సమ్రీన్ కౌర్ వైభవ్ ఆటతీరుకు ముగ్ధురాలైంది. మ్యాచ్ ముగిశాక ఆమె నేరుగా వైభవ్ దగ్గరకు వెళ్లి అతడితో చాలా సేపు ముచ్చటించింది. అయితే తన గర్ల్‌ఫ్రెండ్ ఆ కుర్రాడితో అంతగా కలిసిపోవడం చూసి పక్కనే ఉన్న అర్ష్‌దీప్ సింగ్ ముఖ కవళికలు వింతగా మారిపోయాయి. దీనికి సంబంధించిన సరదా వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

View this post on Instagram

A post shared by CricCard 🏏 (@cric.card)

కేవలం సమ్రీన్ మాత్రమే కాదు, పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా కూడా వైభవ్‌ను ప్రశంసించకుండా ఉండలేకపోయింది. మ్యాచ్ అనంతరం ఆమె స్వయంగా గ్రౌండ్‌లోకి వెళ్లి వైభవ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించింది. క్రికెట్ భవిష్యత్తు సురక్షితంగా ఉంది అనేలా వైభవ్ ఆటతీరు ఉందని ఆమె కొనియాడారు. బిహారీ బాబు టాలెంటుకు బాలీవుడ్ భామలు ఫిదా అవ్వడం ఇప్పుడు ఐపీఎల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చగా మారింది.

వైభవ్ సూర్యవంశీ టాలెంట్ గమనిస్తుంటే, 2027 ప్రపంచకప్ నాటికి అతను టీమిండియాలో ఓపెనర్‌గా సెటిల్ అయిపోతాడని మాజీ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో అరంగేట్రం చేసి, అంతటి వేగంగా పరుగులు సాధించడం ఎవరికీ సాధ్యం కాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో “వైభవ్.. ఐపీఎల్ అసలైన వైభవం” అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. తన గర్ల్ ఫ్రెండ్ వైభవ్ తో మాట్లాడడాన్ని కొంత మంది అర్షదీప్ ఫేస్ మార్ఫింగ్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us