AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెండూల్కర్ ఇంట పెళ్ళి వేడుక.. రాష్ట్రపతి, ప్రధాని మోదీ, రాహుల్‌ను కలిసిన సచిన్.. వివాహానికి ఆహ్వానం

భారత రత్న, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి సందడి జోరందుకుంది. ముంబైలో మార్చి 3వ తేదీ నుంచి మూడు రోజులపాటు అత్యంత వైభవంగా సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కి సానియా చందోక్ తో వివాహం జరగనుంది. ఈ వివాహ వేడుకకు రాజకీయ, క్రీడా, పారిశ్రామిక, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

టెండూల్కర్ ఇంట పెళ్ళి వేడుక.. రాష్ట్రపతి, ప్రధాని మోదీ, రాహుల్‌ను కలిసిన సచిన్.. వివాహానికి ఆహ్వానం
Sachin Tendulkar Family Meets President Murmu
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Feb 11, 2026 | 8:05 AM

Share

భారత రత్న, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి సందడి జోరందుకుంది. ముంబైలో మార్చి 3వ తేదీ నుంచి మూడు రోజులపాటు అత్యంత వైభవంగా సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కి సానియా చందోక్ తో వివాహం జరగనుంది. ఈ వివాహ వేడుకకు రాజకీయ, క్రీడా, పారిశ్రామిక, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. అందులో భాగంగా సచిన్ తన కుటుంబ సభ్యులు భార్య అంజలి, కుమార్తె సారా, అర్జున్, సానియా కలిసి ఢిల్లీలో పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందజేశారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను వివాహ వేడుకకు ఆహ్వానించారు. సచిన్ సోషల్ మీడియాలో ఈ భేటీల ఫొటోలు షేర్ చేసి, ప్రముఖుల ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలిపారు.

సచిన్ కి కాబోయే కోడలు సానియా చందోక్ అర్జున్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితురాలు. ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు. ఈమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్, వెటర్నరీ టెక్నీషియన్‌గా, పెట్ స్పా వ్యాపార యజమానిగా ఉన్నారు. ఇంటర్ కాంటినెంటల్ వంటి ప్రీమియం హోటల్ ఆస్తుల నిర్వహణలో పాల్గొంటూ ఘాయ్ కుటుంబ వ్యాపారం హాస్పిటాలిటీ రంగానికి కూడా విస్తరించింది. గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ FY23-24లో రూ. 624 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

అర్జున్ టెండూల్కర్ – సానియా చందోక్ వివాహం వైపు మొదటి అడుగు 2025 ఆగస్టులో వేశారు. వారి నిశ్చితార్థ వేడుకకు దగ్గరి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అర్జున్ టెండూల్కర్ – సానియా చందోక్ వివాహ వేడుక మార్చి 5, 2026న జరుగుతుంది. గత నెలలో, సచిన్ టెండూల్కర్ స్వయంగా అర్జున్ – సానియా నిశ్చితార్థ వార్తను ధృవీకరించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..