AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్వర్గానికి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఈ పర్వతాన్ని చూస్తే చాలు..! ఆ అందాలకు దాసోహం అవ్వాల్సిందే..

ప్రకృతి సృష్టించే అద్భుతాలు కొన్నిసార్లు చూసే వారికి మైండ్ బ్లాక్ చేస్తుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిని హెవెన్స్ గేట్ (స్వర్గపు ద్వారం) అని పిలుస్తున్నారు. మేఘాల మధ్యలో ఉండే ఈ కొండపైకి చేరుకోవడానికి పర్యాటకులు ఏకంగా 999 నిటారైన మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ప్రకృతి అందాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ వింత అద్భుతాన్ని డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. నెటిజన్లు దీనిని భూమిపై ఉన్న స్వర్గం అని కొనియాడుతున్నారు. స్వర్గానికి వెళ్లాల్సిన అవసరం లేదని, జీవితంలో ఒక్కసారైన ఈ పర్వతాన్ని చూస్తే చాలు.. ఆ అందాలకు దాసోహం అవ్వాల్సిందే..అంటూ నెటిజన్లు కామెంట్‌ చేశారు. ఇంతకీ ఈ అందాల కొండ ఎక్కడ ఉంది..?

Viral Video: స్వర్గానికి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఈ పర్వతాన్ని చూస్తే చాలు..! ఆ అందాలకు దాసోహం అవ్వాల్సిందే..
Heaven's Gate China
Jyothi Gadda
|

Updated on: Jun 19, 2026 | 4:50 PM

Share

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, మనుషులు ఊహించని ప్రకృతి అద్భుతాలు దాగి ఉన్నాయి. వాటిని చూసినప్పుడు ఇది నిజంగా ప్రకృతి సృష్టియేనా?” అని ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఒక అద్భుతమైన పర్వతానికి సంబంధించిన వీడియో తెగ హల్చల్ చేస్తోంది. చైనాలోని హునాన్ ప్రాంతంలో ఉన్న త్యాన్మెన్ పర్వతం (Tianmen Mountain) లోని రాతి కట్టడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు హెవెన్స్ గేట్ (Heaven’s Gate), స్వర్గపు ద్వారం అని పిలుస్తారు.

వైరల్ అవుతున్న వీడియోలో పర్వతం మధ్యలో ఒక భారీ గుహ, ఒక పెద్ద ద్వారం లాగా కనిపిస్తుంది. కొండల మధ్యలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ భారీ కిటికీ లాంటి మార్గం నేరుగా ఆకాశంలోకి తెరుచుకున్నట్లు ఉంటుంది. ముఖ్యంగా చుట్టుపక్కల మేఘాలు కమ్ముకున్నప్పుడు ఈ దృశ్యం చూస్తే, నిజంగానే మనం స్వర్గానికి వెళ్లే దారిని చూస్తున్నామా అనే అనుభూతి కలుగుతుంది. కానీ, ఈ అద్భుతాన్ని చేరుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు.!

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టాగ్రామ్‌లో pahadan అనే ఐడి ద్వారా షేర్ చేయబడిన ఈ డ్రోన్ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అయితే, ఈ అద్భుతమైన ప్రదేశానికి చేరుకోవడం అంత సులువేమీ కాదు. కొండ కింద నుండి ఈ హెవెన్స్ గేట్ మెహరాబ్‌ను (Arch) తాకాలి అంటే పర్యాటకులు కఠినమైన ప్రయాణాన్ని దాటాలి. ఇందుకోసం ఏకంగా 999 నిటారైన సిమెంట్లు మెట్లను ఎక్కవలసి ఉంటుంది. దీనిని స్టేర్‌వే టు హెవెన్ (స్వర్గానికి మెట్లు) అని పిలుస్తారు. ఎత్తుపైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, నిటారైన మెట్లు ఉండటంతో ఇక్కడికి వెళ్లడం ఒక పెద్ద అడ్వెంచర్‌లా మారుతుంది. అయితే, నడవలేని వారి కోసం పర్వతం లోపలి భాగం నుండి వెళ్లే ఆధునిక ఎస్కలేటర్ల సౌకర్యం కూడా ఉంది. పర్వతం లోపల లోతుగా నిర్మించిన ఈ మెట్లు, ఎస్కలేటర్లు ఒక సాహస సినిమా ఉత్కంఠను తలపిస్తాయి. శిఖరాన్ని చేరుకున్న తర్వాత, అక్కడి గాలి, విశాలమైన ప్రదేశం ఒక ప్రత్యేకమైన ప్రశాంతత భావనను అందిస్తాయని పర్యాటకులు చెబుతారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ ప్రదేశం కేవలం పర్యాటక పరంగానే కాకుండా చైనా సంస్కృతిలో ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ తాంగ్ రాజవంశం కాలం నాటి ఒక పురాతన బౌద్ధ దేవాలయం కూడా ఉంది. ఈ పర్వతాలపై ఉండే ప్రశాంతత, ప్రకృతి అందాలు పర్యాటకులకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఆలయంలోని ప్రశాంతత, పర్వతాల మధ్య ప్రతిధ్వనించే ప్రార్థనలు సందర్శకులను నగర కోలాహలం నుండి దూరం చేస్తాయి. రాత్రిపూట, ఈ సహజ వంపును ప్రత్యేక దీపాలతో వెలిగించినప్పుడు, అది నిజంగా ఒక దైవ ద్వారంలా ప్రకాశిస్తుంది. ఈ వీడియోను చూసిన ఇంటర్నెట్ వినియోగదారులు నా జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించాలి అని, ప్రకృతి కంటే గొప్ప శిల్పి ఎవరూ లేరు అని కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ న్యూస్‌ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?
మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?
బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?
బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు
ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే