AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో లవంగం.. అంత పనిచేస్తుందా..? రోజూ రెండు నోట్లో వేసుకున్నారంటే ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్!

లవంగాలు కేవలం వంటల రుచిని పెంచే సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఇవి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే పోషకాల పవర్‌హౌజ్. రోజూ కేవలం రెండు లవంగాలు నమలడం లేదా లవంగాల నీటిని తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే ఎగిరి గంతేస్తారు. అంతేకాదు.. తీవ్రమైన వ్యాధుల్ని సైతం లవంగాలు దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ చూద్దాం..

వామ్మో లవంగం.. అంత పనిచేస్తుందా..? రోజూ రెండు నోట్లో వేసుకున్నారంటే ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్!
Health Benefits Of Cloves
Jyothi Gadda
|

Updated on: Jun 17, 2026 | 9:13 PM

Share

మన వంటింట్లో లభించే అద్భుతమైన సుగంధ ద్రవ్యాలలో లవంగాలు ఒకటి. కేవలం వంటల రుచిని, సువాసనను పెంచడానికే కాకుండా, ఆయుర్వేదంలోనూ, ఆధునిక ఆరోగ్య శాస్త్రంలోనూ లవంగాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రోజువారీ ఆహారంలో భాగంగా కేవలం 2 లవంగాలను తీసుకోవడం లేదా లవంగాలు మరిగించిన నీటిని తాగడం వల్ల శరీరానికి ఎన్నో మేలు రకాల పోషకాలు అందుతాయని నిపుణులు చెప్తున్నారు. లవంగాలను పోషకాల పవర్‌హౌజ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో ఉండే యూజీనాల్ అనే సమ్మేళనం, పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి.

తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ:

లవంగాలలో వాపును (Inflammation) తగ్గించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఆర్థరైటిస్ (కీళ్లనొప్పులు) వంటి సమస్యలతో బాధపడేవారికి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇందులో ఉండే యూజీనాల్ డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా సహాయపడుతుందని పరిశోధనల్లో తేలింది.

రోగనిరోధక శక్తి, నోటి ఆరోగ్యం:

లవంగాల్లో విటమిన్-సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. అలాగే, లవంగాల్లో సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. రోజూ లవంగాలు నమలడం వల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. దీనివల్ల నోటి దుర్వాసన తగ్గడమే కాకుండా, చిగుళ్ల నొప్పుల నుంచి, పంటి నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియ, కాలేయ పనితీరు:

లవంగాలు జీర్ణక్రియను ప్రోత్సహించే సహజ లక్షణాలను కలిగి ఉంటాయి. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి వివిధ రకాల జీర్ణ సమస్యలకు ఇవి అద్భుతమైన చికిత్సగా పనిచేస్తాయి. అంతేకాకుండా, కాలేయంలో (Liver) పేరుకుపోయిన కొవ్వును, హానికర విష పదార్థాలను (Toxins) తొలగించడం ద్వారా కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ:

డయాబెటిస్ రీసెర్చ్ జర్నల్ ప్రకారం, లవంగాలలోని యూజినాల్, ఫ్లేవనాయిడ్లు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి గ్లూకోజ్ శోషణను తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు నిత్యం లవంగాలను తీసుకోవడం ఎంతో ప్రయోజనకరం. అలాగే, ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, ఆరోగ్యకరమైన రక్తప్రసరణకు దోహదపడటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన జీవితం కోసం నిపుణుల సూచన మేరకు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం లవంగాల నీటిని అలవాటు చేసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us