AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Catch Drop : కోహ్లీ క్యాచ్ వదిలేస్తే ఎగిరి గంతేసిన అనుష్క.. దూబేకి మాత్రం ఈగో దెబ్బతిన్నట్టుంది

Virat Kohli Catch Drop : ఆర్సీబీ వర్సెస్ సిఎస్‌కే మ్యాచ్‌లో కోహ్లీ క్యాచ్ వదిలేసినప్పుడు అనుష్క శర్మ సంబరాలు చేసుకోగా, ఆ తర్వాత క్యాచ్ పట్టిన శివం దూబే అగ్రెసివ్ సెలబ్రేషన్స్‌తో బదులిచ్చారు. గట్టిగా అరుస్తూ, చప్పట్లు కొడుతూ ఆమె సెలబ్రేట్ చేసుకున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

Virat Kohli Catch Drop : కోహ్లీ క్యాచ్ వదిలేస్తే ఎగిరి గంతేసిన అనుష్క.. దూబేకి మాత్రం ఈగో దెబ్బతిన్నట్టుంది
Anushka Sharma
Rakesh
|

Updated on: Apr 06, 2026 | 7:00 AM

Share

Virat Kohli Catch Drop : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య జరిగిన మ్యాచ్ కేవలం పరుగుల వరదకే కాదు, మైదానంలో జరిగిన హై డ్రామాకు కూడా వేదికైంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు అనుష్క శర్మ సంబరాలు, ఇటు శివం దూబే అగ్రెసివ్ రియాక్షన్లు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. చెన్నైతో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం 28 పరుగులు మాత్రమే చేసినప్పటికీ, ఆట ప్రారంభంలోనే ఆయనకు ఒక భారీ లైఫ్ దొరికింది. ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్లో కోహ్లీ ఒక భారీ షాట్ కొట్టగా, బంతి నేరుగా లాంగ్ ఆన్ వైపు వెళ్ళింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న శివం దూబే ఆ క్యాచ్‌ను చాలా ఈజీగా పట్టేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా దూబే ఆ క్యాచ్‌ను వదిలేశారు. అప్పటికి కోహ్లీ స్కోరు కేవలం 7 పరుగులు మాత్రమే. ఈ క్యాచ్ డ్రాప్ అవ్వగానే స్టాండ్స్‌లో ఉన్న అనుష్క శర్మ ఆనందానికి అవధుల్లేవు. గట్టిగా అరుస్తూ, చప్పట్లు కొడుతూ ఆమె సెలబ్రేట్ చేసుకున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

లైఫ్ దొరికినా కలిసిరాని అదృష్టం

లైఫ్ దొరికిన తర్వాత కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అన్షుల్ కంబోజ్ వేసిన ఐదో ఓవర్లో కోహ్లీ మళ్ళీ అదే తప్పు చేశాడు. మరో భారీ షాట్ ఆడబోయి బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. ఈసారి కూడా బంతి శివం దూబే దగ్గరికే వెళ్ళింది. అయితే ఈసారి దూబే ఏమాత్రం తప్పు చేయకుండా క్యాచ్‌ను పట్టుకున్నాడు. క్యాచ్ పట్టగానే దూబే సాధారణంగా శాంతంగా ఉంటారు, కానీ ఈసారి మాత్రం ఊహించని విధంగా చాలా అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. తానూ పగ తీర్చుకున్నానన్న రేంజ్‌లో ఆయన చూపించిన రియాక్షన్ కోహ్లీ అభిమానులను ఆశ్చర్యపరిచింది.

పడిక్కల్, డేవిడ్ విధ్వంసం.. ఆర్సీబీ భారీ స్కోరు

కోహ్లీ త్వరగానే అవుట్ అయినా, ఆర్సీబీ మిగిలిన బ్యాటర్లు మాత్రం చెన్నై బౌలర్లను చితక్కొట్టారు. దేవదత్ పడిక్కల్ కేవలం 29 బంతుల్లో 50 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. ఇక ఆఖర్లో ట్రిమ్ డేవిడ్ రాక్షస బ్యాటింగ్ చేశాడు. 25 బంతుల్లోనే 8 సిక్సర్లు బాది అజేయంగా 70 పరుగులు చేయడంతో ఆర్సీబీ స్కోరు 250 పరుగులకు చేరుకుంది. ఇది ఈ ఐపీఎల్ సీజన్‌లోనే అత్యధిక స్కోరు కావడం విశేషం. కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా 19 బంతుల్లో 48 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us