రాసిపెట్టుకోండి.! ఆ పిచ్చోడ్ని వేలంలో SRH కొంటే.. ఇక మిగిలిన జట్లకు రక్త కన్నీరే
రిటైన్, రిలీజ్ లిస్టులు బయటకు వచ్చేశాయ్. ఇక ఇప్పుడు మినీ వేలంలో కీలక ఆటగాళ్లను తీసుకోవడమే ఇప్పుడు మిగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ బౌలింగ్ లోటుపాట్లను చూసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా కోర్ టీంను హైదరాబాద్ జట్టు అట్టిపెట్టుకుంది. ఆ వివరాలు ఇలా..

కొన్నేళ్లుగా ఒకే ఫ్రాంచైజీకి సేవలు అందిస్తున్నా.. ఫాం కోల్పోయి, ఆ జట్టుకు సదరు ప్లేయర్ వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోతే.. కచ్చితంగా అతడు బయటకు వచ్చేయాల్సిందే. ఆండ్రీ రస్సెల్ విషయంలోనూ ఇదే జరిగింది. 2014 నుంచి దాదాపుగా 11 ఏళ్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు రస్సెల్. ఇక ఒక్క సీజన్ అతడికి సరిగ్గా లేకపోవడంతో.. ఆ ఫ్రాంచైజీ మనోడిని మినీ వేలంలోకి వదిలేసింది. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఐపీఎల్ 2026 మినీ వేలంలో రస్సెల్ వన్ ఆఫ్ ది షో టాపర్‌గా నిలుస్తాడని అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంచితే.. తాజాగా రస్సెల్ గురించి సోషల్ మీడియాలో ఓ రూమర్ తెగ హల్చల్ చేస్తోంది.
రస్సెల్ ఇప్పటిదాకా ఇన్‌స్టాగ్రామ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యాన్ని మాత్రమే ఫాలో అవుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును కూడా ఫాలో అవుతున్నాడు. ఇక దీన్ని చూస్తుంటే కచ్చితంగా వేలంలో SRH రస్సెల్ కోసం పోటీపడుతుందని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. అంతేకాదు ఇప్పటికే హైదరాబాద్ జట్టు బలమైన బ్యాటింగ్ లైనప్‌తో గట్టిగా ఉంది. టాప్ ఆర్డర్‌లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్.. అలాగే క్లాసెన్‌తో విధ్వంసకర బ్యాటింగ్ ఉండగా.. ఇప్పుడు ఫినిషర్ రోల్‌లో రస్సెల్ వచ్చాడంటే.. మిగిలిన జట్లకు కచ్చితంగా రక్త కన్నీరేనని ఆరెంజ్ ఆర్మీ అంటోంది. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియదు గానీ.. ఆ ఊహ మాత్రం భలేగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
View this post on Instagram




