AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA : శుభ్‌మన్ గిల్ తర్వాత మరో ఇద్దరు.. గౌహతి టెస్టుకు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్

భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అద్భుతమైన క్రికెట్‌ను చూసినా అది గాయాల కారణంగా కూడా వార్తల్లో నిలిచింది. కోల్‌కతా టెస్ట్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇప్పుడు గువహతిలో జరగనున్న రెండో టెస్ట్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు మరో భారీ షాక్ తగిలింది.

IND vs SA : శుభ్‌మన్ గిల్ తర్వాత మరో ఇద్దరు.. గౌహతి టెస్టుకు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్
Ind Vs Sa (3)
Rakesh
|

Updated on: Nov 18, 2025 | 5:12 PM

Share

IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అద్భుతమైన క్రికెట్‌ను చూసినా అది గాయాల కారణంగా కూడా వార్తల్లో నిలిచింది. కోల్‌కతా టెస్ట్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇప్పుడు గువహతిలో జరగనున్న రెండో టెస్ట్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. వారిద్దరు కీలక ఆటగాళ్లను ఆసుపత్రికి తరలించారు. ఈ అనూహ్య పరిణామం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

కోల్‌కతా టెస్ట్‌లో మెరిసిన ఇద్దరు సౌతాఫ్రికా ఆటగాళ్లు ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యారు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్, స్పిన్నర్ సైమన్ హార్మర్ లను కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. RevSportz Global ఈ విషయాన్ని నివేదించినప్పటికీ.. వారిద్దరికీ సరిగ్గా ఏమైందనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే వీరికి గాయాలు కాలేదని బహుశా ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవేళ ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు రెండో టెస్ట్‌కు అందుబాటులో లేకపోతే, సౌతాఫ్రికా జట్టుకు ఇది చాలా పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. మార్కో జాన్సెన్, సైమన్ హార్మర్ ఇద్దరూ కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్ట్‌లో అద్భుతంగా రాణించారు. ఈయన ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు. హార్మర్ రెండు ఇన్నింగ్స్‌లలో 4 వికెట్ల చొప్పున పడగొట్టి, మొత్తం 8 వికెట్లు తీసి టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ అవార్డు తన కంటే రెండో ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీ చేసిన కెప్టెన్ టెంబా బావుమాకు దక్కాలని హార్మర్ అభిప్రాయపడ్డాడు.

మార్కో జాన్సెన్ కూడా మ్యాచ్‌లో మొత్తం 5 వికెట్లు తీశాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్, యశస్వి జైస్వాల్ వంటి కీలక ఆటగాళ్ల వికెట్లను జాన్సెన్ తీయగలిగాడు. ఇదిలా ఉండగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. కోల్‌కతా టెస్ట్ సమయంలో మెడ గాయం కారణంగా గిల్, గువహతిలో జరగనున్న రెండో టెస్ట్‌లో ఆడే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. వైద్యులు అతన్ని విమానంలో ప్రయాణించవద్దని కూడా సలహా ఇచ్చినట్లు సమాచారం. గిల్ రాబోయే వన్డే సిరీస్‌కు ఫిట్‌గా ఉంటాడా లేదా అనేదానిపై కూడా సందేహాలు ఉన్నాయి. దీనిపై పూర్తి స్పష్టత త్వరలో రానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..