Amit Mishra : సారీ భయ్యా.. నేను మోసం చేశా.. నా ఏజ్ 42కాదు..43.. ఫ్రాడ్ చేసినట్లు ఒప్పుకున్న స్టార్ ప్లేయర్
42 ఏళ్ల భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 2024 నుండి ఎలాంటి పోటీ క్రికెట్ ఆడలేదు. చివరకు, సెప్టెంబర్ 4, 2025న తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. అతను 42 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యాడు. అయితే, ఒకప్పుడు తన ఏజ్-గ్రూప్ క్రికెట్ రోజుల్లో తాను వయసును మార్చేశానని అతను ఒప్పుకున్నాడు.

Amit Mishra : భారత సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (42) అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 2024 నుంచి ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. చివరికి సెప్టెంబర్ 4, 2025న తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. తన 42వ ఏట రిటైర్ అయిన మిశ్రా, ఒకప్పుడు తాను వయస్సు మోసం చేసినట్లు స్వయంగా అంగీకరించాడు.
ఏజ్ ఫ్రాడ్ చేసిన అమిత్ మిశ్రా..
అమిత్ మిశ్రా ఏజ్-గ్రూప్ క్రికెట్‌లో పేరు తెచ్చుకుంటున్న రోజుల్లో ఈ సంఘటన జరిగింది. తన వయస్సును మార్చారని మిశ్రాకు కూడా తెలియదు. ఈ విషయాన్ని తన కోచ్‌పైకి నెట్టేశాడు. ఒక ప్రముఖ యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కోచ్ వయస్సు తగ్గించుకోవాలని సలహా ఇచ్చాడని మిశ్రా చెప్పాడు.
అమిత్ మిశ్రా స్వయంగా మాట్లాడుతూ.. “నా వయస్సులో ఒక సంవత్సరం తేడా ఉందని చెప్పాలనుకుంటున్నాను. నా కోచ్ అలా చేయడానికి సహాయం చేశారు. నాకు ఈ విషయం అస్సలు తెలియదు. కోచ్ మా ఇంటికి ఫోన్ చేసి మరో సంవత్సరం టైం అడిగారు. అది చాలా ఎమోషనల్ మూమెంట్. నేను షాక్ అయ్యాను. ఇది ఎలా సాధ్యం? అని అడిగాను. దానికి ఆయన ఈరోజు నుంచి నీకు ఒక సంవత్సరం తక్కువ. నీకు ఇంకా 2 ఏళ్లు ఉన్నాయని చెప్పారు. నేను కూడా దానికి ఒప్పుకున్నాను” అని చెప్పాడు.
నమ్మలేకపోయిన రోహిత్ శర్మ
అదే సమయంలో ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ అమిత్ మిశ్రా వయస్సు గురించి అడిగిన వీడియో వైరల్ అయ్యింది. అప్పుడు మిశ్రా తన వయస్సు 41 అని చెప్పాడు. కానీ రోహిత్ శర్మ అతడు తనకంటే కేవలం 3 ఏళ్లు మాత్రమే పెద్దవాడని నమ్మలేకపోయాడు. దానికి మిశ్రా, తాను చిన్న వయసులోనే అరంగేట్రం చేశానని వివరించాడు.
అమిత్ మిశ్రా కెరీర్..
అమిత్ మిశ్రా 2003లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అతను 22 టెస్ట్ మ్యాచ్‌లలో 76 వికెట్లు, 36 వన్డే మ్యాచ్‌లలో 64 వికెట్లు, 10 టీ20 మ్యాచ్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో 4 హాఫ్ సెంచరీలతో సహా 648 పరుగులు కూడా చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




