Video: నువ్వు కీపర్‌వా లేక ఫ్లాష్ మ్యాన్‌వా..? అలా ఎలా పట్టావ్ బ్రో! క్రికెట్ చరిత్రలో అద్భుతమైన క్యాచ్‌ల్లో ఒకటి!
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ పట్టిన అద్భుత క్యాచ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్టులో వెనుకకు పరుగెత్తుతూ, డైవ్ చేస్తూ, సహచర ఆటగాడితో ఢీకొంటున్నా బంతిని వదలకుండా పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటిగా దీన్ని అభివర్ణిస్తున్నారు.

క్రికెట్‌లో క్యాచ్‌లు పట్టడం సర్వసాధారణం. కొన్ని సార్లు కష్టమైన క్యాచ్‌లను ఆటగాళ్లు అందుకుంటే అద్భుతంగా పట్టాడు అని పొగుడుతాం. సూపర్ క్యాచ్, కళ్లు చెదిరే క్యాచ్ అంటూ మెచ్చుకుంటూ. అలాంటి ఎన్నో క్యాచ్‌లు క్రికెట్ చరిత్రలో ఉన్నాయి. అయితే తాజాగా చోటు చేసుకున్న ఓ క్యాచ్ మాత్రం అస్సలు నమ్మశక్యంగా లేదు. అసలు ఒక కీపర్ అలా ఎలా పట్టుకుంటాడు అని ప్రతి క్రికెట్ అభిమాని ఆశ్చర్యపోయేలా ఉందా క్యాచ్. ఇంతకీ ఆ క్యాచ్ పట్టింది ఎవరంటే.. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ.
బ్రిస్బేన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో అలెక్స్ కారీ స్టంప్స్ వెనుక వెనక్కి పరిగెడుతూ మరో ఆటగాడితో పోటీ పడుతూ కూడా అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 67 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్.. నాలుగో బంతిని గాస్ అట్కిన్సన్స్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అట్కిన్సన్ ఆ బంతిని ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచింది. బంతి కీపర్ వెనుకకు వెళ్లగా క్యాచ్ అందుకోవడానికి కారీ, మార్నస్ లబుషేన్ ఇద్దరూ పరిగెత్తారు. అందుకోసం ఇద్దరు కూడా డైవ్ చేశారు.
అయితే కారీ మాత్రం అద్భుతంగా డైవ్ చేస్తూ బంతిని అందుకోగలిగాడు. వెనక్కి పరిగెడుతూ క్యాచ్ అందుకోవడం ఎప్పుడూ కష్టమై. పైగా డైవ్ చేస్తున్న సమయంలో మరో ఫీల్డర్ లబుషేన్ అతడిని ఢీకొన్నప్పటికీ కారీ మాత్రం బంతిని విడిచిపెట్టలేదు. అతడి క్యాచ్‌ను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. పక్కన ఉన్న లబుషేన్ సైతం కారీ హత్తుకుని అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌లలో ఇది ఒకటని చాలా మంది క్రికెట్ అభిమానులు అంటున్నారు.
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




