ఈ బౌలర్ టీమిండియా నడ్డి విరిచాడు.. ఐసీసీ అవార్డుతో సత్కరించింది.. ఎవరో తెలుసా!

టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడమంటే అసాధ్యమనే చెప్పాలి. అయితే ఈ యువ బౌలర్...

ఈ బౌలర్ టీమిండియా నడ్డి విరిచాడు.. ఐసీసీ అవార్డుతో సత్కరించింది.. ఎవరో తెలుసా!
Ajaz Patel

టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడమంటే అసాధ్యమనే చెప్పాలి. అయితే ఈ యువ బౌలర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. అది కూడా అలాంటి.. ఇలాంటి జట్టు కాదు.. టీమిండియాపై ఈ ఫీట్ సాధించాడు. 10 వికెట్లు పడగొట్టి భారత్ నడ్డి విరిచాడు. మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఈపాటికి ఎవరో మీకు అర్ధమైపోయి ఉంటుంది. అతడెవరో కాదు న్యూజిలాండ్ ఆఫ్ స్పిన్నర్‌ అజాజ్ పటేల్.

గతేడాది డిసెంబర్‌లో ముంబై వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో అజాజ్ 10 వికెట్లు సాధించాడు. ఇంత అద్భుత ప్రదర్శన కనబరిచిన అజాజ్ పటేల్‌కు ఐసీసీ డిసెంబర్ నెల ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును ఇచ్చి సత్కరించింది. టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్‌లను ఓడించి.. అజాజ్ ఈ అవార్డును దక్కించుకోవడం గమనార్హం.

టెస్టు క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అజాజ్ అవతరించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే ముందు వరుసలో ఉన్నారు. ముంబై టెస్టులో అజాజ్ పటేల్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ కలిపి 14 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో అజాజ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టినా.. కివీస్ మాత్రం 372 పరుగుల భారీ తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. భారత సంతతికి చెందిన అజాజ్ పటేల్.. ముంబైలో పుట్టాడు.. ఆ తర్వాత అతడు పుట్టిన కొన్నేళ్ళకు అజాజ్ కుటుంబం న్యూజిలాండ్‌కు షిఫ్ట్ అయింది.

మరోవైపు ముంబై టెస్టులో సెంచరీ సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మయాంక్ అగర్వాల్.. యాషెస్ సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన మిచెల్ స్టార్క్.. వారి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్‌లకు ప్లేయర్ ఆఫ్ ద మంత్‌ అవార్డుకు ఎంపికయ్యారు. కాగా, అజాజ్ పటేల్ ఇప్పటివరకు 11 టెస్టులు ఆడి 43 వికెట్లు పడగొట్టాడు. 2018లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేశాడు. భారత్‌పై ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన అజాజ్ పటేల్.. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. నడంలో సందేహం లేదు.

Also Read:

ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్‌.. కష్టం కాదు.!

ఈ పాము చాలా డేంజర్.. దీని వేట మాములుగా ఉండదు.. దొరికితే జ్యూస్‌లా చేసి తాగేస్తుంది!

 ఒకరిద్దరు కాదు.. ఏకంగా 1000 మంది జంటల వికృత రాసలీలలు.. భార్యలను మార్చుకుంటూ..

Click on your DTH Provider to Add TV9 Telugu