AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virender Sehwag: గంగూలీ, మహేంద్రసింగ్‌ ధోనీ.. వీరిద్దరిలో బెస్ట్‌ కెప్టెన్‌ ఎవరు.? సెహ్వాగ్‌ సమాధానం ఏంటో తెలుసా.?

Virender Sehwag: గంగూలీ, మహేంద్రసింగ్‌ ధోనీ వీరిద్దరూ మేటి క్రికెటర్లు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టీమిండియాకు ఎన్నో అపురూప విజయాలను..

Virender Sehwag: గంగూలీ, మహేంద్రసింగ్‌ ధోనీ.. వీరిద్దరిలో బెస్ట్‌ కెప్టెన్‌ ఎవరు.? సెహ్వాగ్‌ సమాధానం ఏంటో తెలుసా.?
Narender Vaitla
|

Updated on: Sep 15, 2021 | 9:47 PM

Share

Virender Sehwag: గంగూలీ, మహేంద్రసింగ్‌ ధోనీ వీరిద్దరూ మేటి క్రికెటర్లు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టీమిండియాకు ఎన్నో అపురూప విజయాలను అందించి, జట్టును అగ్ర స్థానంలో నిలిపారు. మరి వీరిద్దరిలో బెస్ట్‌ కెప్టెన్‌ ఎవరనే ప్రశ్న వస్తే..? సమాధానం మాత్రం అంత సులువుగా దొరకదు. ఇండియన్‌ క్రికెట్‌కు వీరిద్దరూ ఎనలేని సేవలు అందించారు. ఇది ఎవరూ కాదనలేని నిజం. అయితే వీరిద్దరిలో బెస్ట్‌ కెప్టెన్‌ ఎవరనే ప్రశ్న ఇటీవల మాజీ టీమిండియా ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు ఎదురైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇద్దరిలో ఉత్తమ సారథి ఎవరనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘నా దృష్టిలో ఆ ఇద్దరు మాజీలు గొప్ప కెప్టెన్లు. వారిద్దరు ఎవరికి వారే ప్రత్యేకం. గంగూలీ విపత్కర పరిస్థితుల్లో గంగూలీ టీమిండియాను ఏకతాటిపైకి తెచ్చాడు. నాణ్యమైన ఆటగాళ్లను ఎంపిక చేసి భారత టీమ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాడు. అంతేకాకుండా విదేశాల్లో ఎలా గెలవాలో టీమిండియాకు నేర్పించాడు’ అంటూ గంగూలీపై పొగడ్తల వర్షం కురిపించాడు.

ఇక ధోనీ గురించి మాట్లాడుతూ.. ‘ధోనీ జట్టు పగ్గాలు చేపట్టేనాటికే భారత్‌ గొప్ప జట్టుగా ఉంది, అది అతడికి కలిసొచ్చింది. దీంతో ధోనీకి కొత్త జట్టును తయారు చేయడంలో ఇబ్బందులు ఎదురుకాలేదు. ఇక ధోనీ కూడా అద్భుత ఆటగాడు. ఇద్దరూ గొప్ప సారథులు’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తన వ్యక్తిగత అభిప్రాయం మేరకు మాత్రం గంగూలీనే అత్యుత్తమ కెప్టెన్‌ అని సెహ్వాగ్‌ స్పష్టం చేశాడు.

Also Read: GOLD ETF: బంగారం కొనడం కన్నా.. ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టడం లాభదాయకం.. ఎలానో తెలుసుకోండి!

Viral Video: నడి రోడ్డుపై చిందులు వేసిన యువతి.. డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుందీ. కానీ వారు మాత్రం..

Viral Pic: ఈ ఫోటోలోని చిన్నారి చాలా ఫేమస్.. ఇప్పుడొక హీరోయిన్.. కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్..