ICC T20 World Cup 2021: పొట్టి కప్‌లో ఏ జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదు.. కారణం ఇదేనంటోన్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్..!

అక్టోబర్ 17 నుంచి ఒమన్, యూఏఈలో టీ 20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ జరుగుతాయి. సూపర్ -12 స్టేజ్ అక్టోబర్ 23 నుంచి ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది.

ICC T20 World Cup 2021: పొట్టి కప్‌లో ఏ జట్టుకు పెద్దగా ప్రయోజనం ఉండదు.. కారణం ఇదేనంటోన్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్..!
T20 World Cup
Follow us
Venkata Chari

|

Updated on: Sep 16, 2021 | 7:03 AM

T20 World Cup 2021: ఐపీఎల్ 2021 మరోసారి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అలాగే అన్ని జట్ల ఆటగాళ్లు కూడా ఈ లీగ్‌ కోసం ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. అయితే, ఈ టోర్నీ ముగిసిన వెంటనే టీ 20 ప్రపంచ కప్‌ మొదలుకానుంది. ఈసారి ఐపీఎల్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే టోర్నమెంట్ ముగిసిన వెంటనే యూఏఈలోనే టీ20 ప్రపంచ కప్ మొదలుకానుంది. ఐపీఎల్‌లో ఆడుతున్న చాలా మంది ఆటగాళ్లు ఈ టీ 20 ప్రపంచకప్‌లో తమ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ప్రతి జట్టులోని కొంతమంది ఆటగాళ్లకు యూఏఈలో ఆడిన అనుభవం ఉంటుంది. ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మాక్స్‌వెల్ మాట్లాడుతూ, ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఈసారి ప్రపంచకప్‌లో ఏ జట్టుకు అదనపు ప్రయోజనం పొందే అవకాశాలే చాలా తక్కువగా ఉంటాయని అన్నారు.

సెప్టెంబర్ 20 నుంచి ఐపీఎల్ 2021 సీజన్ రెండవ భాగం మొదలుకానుండగా, అక్టోబర్ 15 న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. రెండు రోజుల తరువాత టీ20 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ ఒమన్, యూఏఈలో ప్రారంభమవుతాయి. అయితే ప్రధాన మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి సూపర్ -12 స్టేజ్‌తో ప్రారంభమవుతాయి. ఈ టోర్నమెంట్ ఇంతకు ముందు భారతదేశంలో జరగాల్సి ఉంది. కానీ, కరోనావైరస్ పరిస్థితి కారణంగా దీనిని ఒమన్, ‎యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఐపీఎల్ 2021 కోసం యూఏఈలో ఉన్న మాక్స్‌వెల్.. ఈ మైదానాల్లో టీ20 ప్రపంచ కప్, ఐపీఎల్ ఇంచుమించుగా ఒకేలా జరుగుతాయని అన్నాడు. డాషింగ్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ మాట్లాడుతూ, “యూఏఈలో టోర్నమెంట్ నిర్వహించడంతో మ్యాచ్ ఫలితాలు ఐపీఎల్‌లానే ఉండోచ్చు. హోమ్ గ్రౌండ్ ప్రయోజనాన్ని ఎవరూ పొందనందున అన్ని జట్లకు అవకాశాలు సమంగానే ఉంటాయి. ఇక్కడ ఐపీఎల్ జరుగుతోంది. చాలా మంది అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా ఇందులో పాల్గొంటున్నారు. తరువాత వారు ప్రపంచ కప్‌లో కూడా ఆడతారు. కాబట్టి పరిస్థితులు అందరికీ ఒకేలా ఉంటాయని అనుకుంటున్నాను” అని తెలిపాడు.

ఆస్ట్రేలియా ఆటగాళ్లకు అధిక ప్రయోజనం.. మాక్స్‌వెల్ కాకుండా ఇతర ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు ఈ సీజన్‌లో భాగంగా ఉన్నారు. ప్రపంచ కప్ జట్టులో కూడా ఉన్నారు. “మా ఆటగాళ్లు చాలా మంది ఐపీఎల్‌లో ఆడతారు. వారికి ఇక్కడి మైదానాలపై మంచి పట్టు లభించే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడతారు. ఇది మా బ్యాట్స్‌మెన్‌లకు మంచి అవకాశంగా ఉంటుంది. టోర్నమెంట్ ప్రారంభమయ్యే సమయానికి, మా బౌలర్లు పూర్తిస్థాయిలో తిరిగి వస్తారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆడటానికి ఎదురుచూస్తున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను” అంటూ తెలిపాడు.

టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలవలేదు.. అక్టోబర్ -12 న ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగే మొదటి మ్యాచ్‌తో సూపర్ -12 దశ ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ గ్రూప్ 1 లో చోటు దక్కించుకున్నాయి. ఈ రెండు జట్లతో పాటు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లు ఉన్నాయి. వెస్టిండీస్ రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకోగా, ఇంగ్లండ్ 2019 వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. టీ 20 ప్రపంచకప్‌ను గెలవడంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా విఫలమయ్యాయి. ఇటీవల ఆస్ట్రేలియా టీ 20 ప్రదర్శన బాగోలేదు. దక్షిణాఫ్రికా ఇటీవల శ్రీలంకను 3-0తో తమ స్వదేశంలో ఓడించింది. దీంతో ఆస్ట్రేలియాకు టీ20 ట్రోఫీ దక్కే అవకాశం చాలా తక్కువ.

Also Read: Virender Sehwag: గంగూలీ, మహేంద్రసింగ్‌ ధోనీ.. వీరిద్దరిలో బెస్ట్‌ కెప్టెన్‌ ఎవరు.? సెహ్వాగ్‌ సమాధానం ఏంటో తెలుసా.?

ఏలియన్ డివిలియర్స్.. 10 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. సెంచరీతో బౌలర్లకు చుక్కలు..

Warangal sports: ఓరుగల్లులో క్రీడా సౌరభం.. లాంగ్‌ జంప్‌.. పరుగుపందెంలో జోష్‌ చూపిన మహిళా స్ప్రింటర్లు