ఏలియన్ డివిలియర్స్.. 10 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. సెంచరీతో బౌలర్లకు చుక్కలు..

AB Devilliers: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2021 సెకండాఫ్ ప్రారంభం కానుంది. మిగిలిన మ్యాచ్‌ల కోసం అన్ని జట్లు యూఏఈ చేరుకున్నాయి. నెట్స్‌లో ఆటగాళ్లు..

ఏలియన్ డివిలియర్స్.. 10 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. సెంచరీతో బౌలర్లకు చుక్కలు..
Devilliers
Follow us

|

Updated on: Sep 15, 2021 | 9:46 PM

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2021 సెకండాఫ్ ప్రారంభం కానుంది. మిగిలిన మ్యాచ్‌ల కోసం అన్ని జట్లు యూఏఈ చేరుకున్నాయి. నెట్స్‌లో ఆటగాళ్లు శ్రమిస్తున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతూ వారి ఫామ్‌ను తిరిగి రాబట్టుకుంటున్నారు. ఇదే క్రమంలోనే విరాట్ కోహ్లీ సారధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా టోర్నీకి సిద్దమవుతోంది. తాజాగా ఈ జట్టుకు చెందిన ఆటగాళ్లు రెండు టీమ్స్‌గా విడిపోయి ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఇందులో ఏబీ డివిలియర్స్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఎలాంటి డొమెస్టిక్, అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా.. అద్భుతమైన షాట్స్‌తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. మిగిలిన జట్లకు హెచ్చరికను చేరవేశాడు.

ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓ జట్టుకు హర్షల్ పటేల్ కెప్టెన్ కాగా.. మరో జట్టుకు దేవదూత్ పడిక్కల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. టాస్ గెలిచిన హర్షల్ పటేల్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. డివిలియర్స్ 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక అతడు తన సెంచరీని కేవలం 46 బంతుల్లోనే సాధించడం గమనార్హం. డివిలియర్స్ తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. అతడితో పాటు, మహమ్మద్ అజారుద్దీన్ 43 బంతుల్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 66 పరుగులు చేశాడు.

భరత్ సూపర్బ్ ఇన్నింగ్స్..

ఇక లక్ష్యచేధనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన పడిక్కల్ టీం.. చివరి బంతికి టార్గెట్‌ను చేధించింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ శ్రీకర్ భరత్ 95 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో భరత్ 95 పరుగులు సాధించాడు. అలాగే జట్టు కెప్టెన్ పడిక్కల్ మంచి ఆరంభాన్ని అందించాడు. 21 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఐదు ఫోర్లు మరియు ఒక సిక్సర్ కొట్టాడు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన వీడియోను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మీరూ ఓ లుక్కేయండి..