BCCI పొమ్మంటే.. KKR రమ్మంది! అబ్బో.. ఇతనికి డిమాండ్‌ మామూలుగా లేదుగా..!

బీసీసీఐ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, మరికొందరిని తొలగించింది. అయితే, వెంటనే అభిషేక్ నాయర్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అసిస్టెంట్ కోచ్‌గా చేరాడు. ఐపీఎల్ 2025లో KKR ప్రదర్శన బలహీనంగా ఉండటంతో అభిషేక్ నాయర్ చేరిక వారికి ఎంత మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.

BCCI పొమ్మంటే.. KKR రమ్మంది! అబ్బో.. ఇతనికి డిమాండ్‌ మామూలుగా లేదుగా..!
Kkr

Updated on: Apr 19, 2025 | 6:06 PM

ఇటీవలె బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో టీమిండియా ఫేలవ ప్రదర్శన కారణంగా టీమిండియా సపోర్టింగ్‌ స్టాఫ్‌ నుంచి అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ సోహమ్‌ దేశాయ్‌లను వారి వారి పోస్టుల నుంచి తొలగించింది. ఇది జరిగి రెండు రోజులు గడవక ముందే.. అభిషేక్‌ నాయర్‌కు వెంటనే మరో కీలక పోస్టు వేరే చోటు దొరికింది. అది మరెక్కడో కాదు.. తను గతంలో పనిచేసిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్‌లోనే. అసిస్టెంట్‌ కోచ్‌గా అభిషేక్‌ను బీసీసీఐ అలా తొలగించిందో లేదు.. వెంటనే కేకేఆర్‌ అతనితో ఒప్పందం కుదర్చుకొని.. టీమ్‌లోకి తెచ్చుకుంది.

ప్రస్తుతం ఐపీఎల్‌ 2025లో కేకేఆర్‌ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉన్న విషయం తెలిసిందే. 2024లో టైటిల్‌ గెలిచి.. ఈ సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కేకేఆర్‌ వాళ్ల స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. 7 మ్యాచ్‌ల్లో కేవలం 3 మాత్రమే గెలిచింది. లాస్ట్‌ సీజన్‌లో వాళ్లు కప్పు కొట్టిన సమయంలో కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌, మెంటర్‌గా గౌతమ్‌ గంభీర్‌, సపోర్టింగ్‌ స్టాఫ్‌లో అభిషేక్‌ నాయర్‌ ఉన్నారు. కానీ, అయ్యర్‌ పంజాబ్‌ కింగ్స్‌కు, గంభీర్‌, అభిషేక్‌ టీమిండియాకు వెళ్లిపోవడంతో కేకేఆర్‌ కాస్త బలహీనపడింది. కానీ, ఇప్పుడు అభిషేక్‌ రాకతో వాళ్లకు కాస్త బలం వచ్చినట్లు ఉంది. మరి చూడాలి.. బీసీసీఐ పొమ్మనగానే రమ్మన్న కేకేఆర్‌కు అభిషేక్‌ నాయర్‌ ఎంత హెల్ప్‌ అవుతాడో.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..