ఆసీస్ చేతిలో ఓడిన శ్రీలంక
వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా శనివారం జరిగిన ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 87 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 334 పరుగులు చేసింది. ఫించ్ 153, స్టీవెన్ స్మిత్ 73, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 46, వార్నర్ 26 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ఇసురు ఉడానా, ధనంజయ డి సిల్వాలు చెరో రెండు వికెట్లు తీసుకోగా, మలింగ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం 335 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాంటింగ్‌కు దిగిన […]
వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా శనివారం జరిగిన ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 87 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 334 పరుగులు చేసింది. ఫించ్ 153, స్టీవెన్ స్మిత్ 73, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 46, వార్నర్ 26 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ఇసురు ఉడానా, ధనంజయ డి సిల్వాలు చెరో రెండు వికెట్లు తీసుకోగా, మలింగ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం 335 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాంటింగ్‌కు దిగిన శ్రీలంక.. ఆరంభంలోనే తడబడింది. 45.5 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ దిముత్ కరుణరత్నె 97, మాథ్యూస్ 9, సిరివర్ధన 3, పెరీరా 52, కుశాల్ మెండిస్ 30 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 4, రిచర్డ్‌సన్ 3, కమిన్స్ రెండు వికెట్లు తీశారు.