IPL 2025: పేరుకే కెప్టెన్.. ప్లేయింగ్ 11లో మాత్రం ప్లేస్ డౌటే.. ఐపీఎల్‌లో ధోని ఫ్రెండ్‌కి ఊహించని షాక్?
Ajinkya Rahane Batting Position in KKR Playing XI: అజింక్య రహానే కెప్టెన్ అయ్యాడు. కానీ, అతను కేకేఆర్ ప్లేయింగ్ XIలో ఏ క్రమంలో ఆడతాడనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్న దిగ్గజ క్రికెటర్లకు కూడా తలనొప్పి తెచ్చిపెట్టింది. కేకేఆర్ ప్లేయింగ్ XIలో కెప్టెన్ రహానె స్థానం గురించి ఆకాష్ చోప్రా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Ajinkya Rahane Batting Position in KKR Playing XI: కోల్‌కతా నైట్ రైడర్స్ అజింక్య రహానేను ఐపీఎల్ (IPL) 2025 కెప్టెన్‌గా నియమించింది. కానీ, ఈ నిర్ణయం తర్వాత అతని పరిస్థితి ఎలా తయారైందో తెలుసుకుంటే.. అటు మింగలేడు, ఇటు కక్కలేకుండా తయారైంది. ప్లేయింగ్ ఎలెవన్ కారణంగా కేకేఆర్ జట్టుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది. నిజానికి, రహానేకు కెప్టెన్సీ అప్పగించిన తర్వాత, జట్టు ప్లేయింగ్ ఎలెవన్ గురించి ప్రశ్నలు తలెత్తాయి. ప్రశ్న ఏమిటంటే రహానె ఎక్కడ ఆడతాడు? కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవన్‌లో రహానే స్థానాన్ని ఆకాష్ చోప్రా చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా రహానే జట్టులో చోటు సంపాదించడానికి కష్టపడాల్సి రావొచ్చని ఆయన అన్నారు.
ఓపెనర్లుగా నరైన్, డి కాక్‌లు..
ఆనంద్ బజార్ పత్రిక నివేదిక ప్రకారం, కేకేఆర్ ఓపెనింగ్ స్లాట్ దాదాపుగా ఫిక్స్ అయింది. సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్‌లతో ఇన్నింగ్స్ ప్రారంభించాలనే మూడ్‌లో మేనేజ్ మెంట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆకాష్ చోప్రా కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. నిజానికి, వెంకటేష్ అయ్యర్‌కు నంబర్ 3 బ్యాటింగ్ స్థానం అనువైన ప్రదేశమని కూడా ఆయన అన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే రహానె మళ్ళీ ఎక్కడ ఆడతాడు? అనే ప్రశ్న వినిపిస్తోంది.
కెప్టెన్ రహానెకు చోటు ఎక్కడ?
రహానేను జట్టు కెప్టెన్‌గా నియమించినందున, అతనికి జట్టులో చోటు కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి, కేకేఆర్ నిర్వహణ దాని ఓపెనింగ్ కాంబినేషన్‌లో లేదా నంబర్ 3 స్థానంలో మార్పులు చేస్తుందా? ఆకాష్ చోప్రా ప్రకారం కేకేఆర్ ముందున్న ఒక ఎంపిక ఏమిటంటే, సునీల్ నరైన్‌కు బదులుగా రహానేను ఓపెనింగ్‌గా పంపవచ్చు అని తెలుస్తోంది. ఇది జట్టుకు కుడి-ఎడమ ఓపెనింగ్ జతను పొందేందుకు వీలు కల్పిస్తుంది. మరో ఎంపిక ఏమిటంటే, వెంకటేష్ అయ్యర్ స్థానంలో రహానేను 3వ స్థానంలో ఉంచడం.
రహానేకు 4వ స్థానంలో ఆడే అవకాశం..
మొదటి రెండు ఎంపికలు కాకుండా, మరొక ఎంపిక ఉంది. అది ఏమిటంటే రహానే ప్లేయింగ్ ఎలెవన్‌లో 4వ స్థానంలో ఆడుతున్నట్లు కనిపించవచ్చు. రహానే స్థానం విషయంలో కేకేఆర్ చాలా తలనొప్పులు ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది. కానీ, అతను ఆ తలనొప్పిని కూడా వదిలించుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో కేకేఆర్ రహానేను ఏ నంబర్‌లో బరిలోకి దించాలని నిర్ణయిస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.
కేకేఆర్ జట్టులో ఆడే ప్రాబబుల్ ప్లేయింగ్ XI..
సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే (కెప్టెన్), రమణ్‌దీప్ సింగ్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్, అన్రిక్ నోర్కియా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..