AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఆ పిచ్చోడ్ని ఆడిస్తే మాత్రం.. రాసిపెట్టుకోండి కప్పు ఆర్సీబీదే!

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టులో చేరిన యువ ఆటగాడు జాకబ్ బెతెల్ గురించి ఈ వ్యాసం వివరిస్తుంది. అతని అద్భుతమైన డొమెస్టిక్ టీ20 రికార్డు మరియు అతని ఆటతీరు ఆర్సీబీకి ఎలా ఉపయోగపడుతుంది అనేది చర్చించబడుతుంది. అయితే, ప్లేయింగ్ ఎలెవెన్ లో చోటు దక్కే అవకాశాలు, ఇతర విదేశీ ఆటగాళ్లతో పోటీ, అతని సామర్థ్యం గురించి విశ్లేషణ చేయబడుతుంది.

IPL 2025: ఆ పిచ్చోడ్ని ఆడిస్తే మాత్రం.. రాసిపెట్టుకోండి కప్పు ఆర్సీబీదే!
Jacob Bethell
SN Pasha
|

Updated on: Mar 17, 2025 | 5:03 PM

Share

ఐపీఎల్‌లో భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉండి, ఒక్క కప్పు కూడా లేని ఏకైక టీమ్‌ ఆర్సీబీనే. అయినా కూడా ఆ టీమ్‌కి ఉన్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. అందుకు కారణం విరాట్‌ కోహ్లీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. అయితే ఈ సారి మాత్రం ఆర్సీబీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. రజత్‌ పాటీదార్‌, విరాట్‌ కోహ్లీ, యష్‌ దయాల్‌ మినహా మిగతా టీమ్‌ మొత్తాన్ని మార్చేసింది ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌. దీంతో ఒక ఫ్రెష్ టీమ్‌తో ఆర్సీబీ ఈ ఐపీఎల్‌ 2025 సీజన్‌లో బరిలోకి దిగబోతుంది. ఐపీఎల్‌ 2025కు సంబంధించి మెగా వేలంలో మంచి మంచి ప్లేయర్లను పట్టింది ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌. సిరాజ్‌ లాంటి ప్లేయర్లను వదిలేయడంపై కాస్త విమర్శలు వచ్చినా.. ఓవరాల్‌గా జట్టు కూర్పు బాగా సెట్‌ అయిందని తర్వాత అభిమానులు రియలైజ్‌ అయ్యారు.

అయితే.. మరికొన్ని రోజుల్లోనే ఐపీఎల్‌ 18వ సీజన్‌ స్టార్ట్‌ కాబోతున్న తరుణంలో ఆర్సీబీ ప్లేయింగ్‌ ఎలెవన్‌పై క్రికెట్‌ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా మంది క్రికెటర్లు తమ తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌ ప్రిడిక్షన్స్‌ ఇచ్చేస్తున్నారు. అయితే క్రికెట్‌ నిపుణులు మాత్రం.. ఆర్సీబీ స్క్వౌడ్‌లో ఉన్న ఓ యంగ్‌ ప్లేయర్‌ను సరిగ్గా వాడుకుంటే మాత్రం ఈ సారి కప్పు కొట్టకుండా ఆర్సీబీని ఎవరు అడ్డుకోలేరంటూ చెబుతున్నారు. ఇంతకీ ఆ ప్లేయర్‌ ఎవరంటే.. ఇంగ్లండ్‌ యువ క్రికెటర్‌ జాకబ్‌ బెతెల్‌. ఈ ప్లేయర్‌ను ఆర్సీబీ ఐపీఎల్‌ మెగా వేలంలో రూ.2.6 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఇంగ్లండ్‌ డొమెస్టిక్ క్రికెట్‌లో ఇరదీస్తున్నాడనే ఈ కుర్రాడ్ని ఏరికోరి మరీ ఆర్సీబీ తమ స్క్వౌడ్‌లోకి తీసుకుంది. డొమెస్టిక్‌ టీ20 క్రికెట్‌లో జాకబ్‌ 63 మ్యాచ్‌లు ఆడి 136.77 స్ట్రైక్‌ రేట్‌తో 1127 పరుగులు సాధించాడు.

అలాగే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో 10 టీ20ల్లో 9 ఇన్నింగ్స్‌లు ఆడి 196 పరుగులు సాధించాడు. అందులో 147.36 స్ట్రైక్‌ రేట్‌తో ఆడుతున్నాడు. ఇలాంటి ప్లేయర్‌ను ఆర్సీబీ కనుక సరిగ్గా వాడుకుంటే మాత్రం.. సంచలనలు నమోదు చేస్తాడని క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. కానీ, జాకబ్‌కు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కుతుందా అనేదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో నలుగురు ఫారెన్‌ ప్లేయర్లు మాత్రమే ఉండాలనే రూల్‌ తెలిసిందే. ఫిల్‌ సాల్ట్‌, లివింగ్‌స్టోన్‌, టిమ్‌ డేవిడ్‌, తుషారా లేదా హెజల్‌వుడ్‌తో నాలుగు స్పాట్‌లు ఫుల్‌ అయిపోయేలా కనిపిస్తున్నాయి. ఒక వేళ సాల్ట్‌, టిమ్‌ డేవిడ్‌ వీరిద్దరిలో ఎవరైనా సరిగ్గా రాణించకుంటే మాత్రం జాకబ్‌కు ప్లేస్‌ దొరికే ఛాన్స్‌ ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..