Video: ‘నీలో ఇంకెన్ని వెరైటీలున్నాయ్ బ్రో.. ఇలా బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థులకు చెమటలే’: ప్రాక్టీస్‌లో సూర్య ఫైరింగ్ చూశారా?

Suryakumar Yadav Viral Video: ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కొత్త సంవత్సరంలోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. 2022లో అతని బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురవనుందనే సూచనలు వచ్చేశాయి.

Video: 'నీలో ఇంకెన్ని వెరైటీలున్నాయ్ బ్రో.. ఇలా బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థులకు చెమటలే': ప్రాక్టీస్‌లో సూర్య ఫైరింగ్ చూశారా?
Surya Kumar Yadav
Follow us
Venkata Chari

|

Updated on: Jan 03, 2023 | 4:55 PM

Suryakumar Yadav: భారతదేశానికి చెందిన 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ 2022లో అదరగొట్టాడు. అతను గతేడాది 31 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 46.56 సగటుతో 187.43 స్ట్రైక్ రేట్‌తో 1164 పరుగులు చేశాడు. ఇది మాత్రమే కాదు తన అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. సూర్యకుమార్ ఇక కొత్త సంవత్సరంలో కొత్త యాటిట్యూడ్ చూపించేందుకు తహతహలాడుతున్నాడు. ఈరోజు 2023లో తొలి మ్యాచ్ ఆడనున్నాడు. మంగళవారం నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కాన్న సంగతి తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ నేడు జరగనుంది.

రోహిత్ శర్మ గైర్హాజరీతో శ్రీలంక టీ20 సిరీస్‌లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, సూర్యకుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. సిరీస్‌కు ముందు సూర్యకుమార్ నెట్స్‌లో విపరీతంగా చెమటోడ్చాడు. విభిన్న షాట్‌లను ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అతని ప్రాక్టీస్ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ‘కొత్త సంవత్సరం, కొత్త ప్రారంభం, కొత్త వైస్ కెప్టెన్’ అంటూ క్యాఫ్షన్ అందించింది. టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు వాంఖడే స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ చేసింది.

ఇవి కూడా చదవండి

సూర్యకుమార్ ఫైరింగ్ ప్రాక్టీస్..

త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీకి విరామం లభించింది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగవచ్చని తెలుస్తోంది. కోహ్లి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నప్పుడు సూర్యకుమార్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. సూర్యకుమార్ నాల్గవ స్థానంలో అద్భుతాలు చేశాడు. కానీ, మూడవ స్థానంలో అతని గణాంకాలు కూడా అద్భుతమైనవిగా నిలిచాయి. సూర్యకుమార్ మూడో స్థానంలో తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 43.7 సగటుతో 306 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 175గా నిలిచింది. ఈ సమయంలో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు కొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..