Watch Video: 2 నిమిషాల్లో 6 ప్యాక్ బాడీ.. జిమ్‌లో రచ్చ చేసిన యూనివర్సల్ బాస్.. యూవీ రిప్లై ఏంటో తెలుసా?

Chris Gayle: కరీబియన్ క్రికెటర్ క్రిస్ గేల్ జిమ్‌లో కనిపిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు పగలబడి నవ్వుతూ కామెంట్లు చేస్తున్నారు.

Watch Video: 2 నిమిషాల్లో 6 ప్యాక్ బాడీ.. జిమ్‌లో రచ్చ చేసిన యూనివర్సల్ బాస్.. యూవీ రిప్లై ఏంటో తెలుసా?
Chris Gayle Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Jan 03, 2023 | 5:22 PM

వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. యూనివర్సల్ బాస్‌గా పేరుగాంచిన గేల్.. ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లలో తన తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో నిరంతరం సందడి చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఒక ఫన్నీ వీడియోను నెట్టింట్లో పంచుకున్నాడు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గేల్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో, అతను జిమ్‌లో ఉన్నట్లుగా కనిపించాడు. గేల్ పూర్తిగా భిన్నమైన రీతిలో జిమ్‌లోకి ప్రవేశించాడు. నేను కష్టపడి ఇక్కడికి వచ్చానని, రెండు నిమిషాల్లో ఏబ్స్ రావాలంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాతే కార్నివాల్ పండుగ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో, ‘ ఇది పార్ట్ 1. పార్ట్ 2కి 5 లక్షల వ్యూస్ రావాలని’ క్యాప్షన్‌లో రాశాడు. గేల్‌కి సంబంధించిన ఈ వీడియోపై విపరీతమైన స్పందన వస్తోంది. గేల్ సరదా చేష్టలు చూసి భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్మైలీ సింబల్ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

విశేషమేమిటంటే, కొన్ని రోజుల క్రితం IPL వేలం 2023 సందర్భంగా వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్‌పై స్పందించినందుకు గేల్ హెడ్ లైన్స్‌లో నిలిచాడు. పూరణ్ రూ.16 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత గేల్ నిక్కీ నేను మీకు ఇచ్చిన అప్పును తిరిగి పొందగలనా అని సరదాగా కామెంట్ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..