AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: 2 బంతుల్లో 21 పరుగులు.. ఈ రాక్షసుడు బరిలోకి దిగితే ఊహకందని ఊచకోతే.. ఎవరంటే

క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, యువరాజ్ సింగ్, గిల్‌క్రిస్ట్.. ఇలా క్రికెట్ చరిత్రలో విధ్వంసకర బ్యాటర్లు చాలానే ఉన్నారు. అయితే భారత ప్లేయర్స్ విషయానికొస్తే.. ఈ లిస్టులో ఫస్ట్ వచ్చేది వీరేంద్ర సెహ్వాగ్.. బౌలర్ ఎవరైనా.. ఓవర్ ఏదైనా.. మొదటి బంతికే సిక్స్ బాదడం సెహ్వాగ్ స్టైల్.

Cricket: 2 బంతుల్లో 21 పరుగులు.. ఈ రాక్షసుడు బరిలోకి దిగితే ఊహకందని ఊచకోతే.. ఎవరంటే
Representative Image
Ravi Kiran
|

Updated on: Apr 26, 2025 | 1:54 PM

Share

క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, యువరాజ్ సింగ్, గిల్‌క్రిస్ట్.. ఇలా క్రికెట్ చరిత్రలో విధ్వంసకర బ్యాటర్లు చాలానే ఉన్నారు. అయితే భారత ప్లేయర్స్ విషయానికొస్తే.. ఈ లిస్టులో ఫస్ట్ వచ్చేది వీరేంద్ర సెహ్వాగ్.. బౌలర్ ఎవరైనా.. ఓవర్ ఏదైనా.. మొదటి బంతికే సిక్స్ బాదడం సెహ్వాగ్ స్టైల్. ఇలా దూకుడైనా ఆటతో ప్రత్యర్ధి బౌలర్లను భయపెడతాడు. ఇక 2000sలో పాకిస్తాన్ బౌలర్ రాణా నవీద్ ఉల్ హుస్సేన్‌కు చుక్కలు చూపించాడు సెహ్వాగ్. దెబ్బకు రెండు బంతుల్లో 21 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్ ఏంటి.? ఆ మ్యాచ్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఈ మ్యాచ్ సరిగ్గా 17 ఏళ్ల క్రితం జరిగింది. మార్చి 13, 2004న భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో రాణా బౌలింగ్ వేశాడు. అప్పటికే ఊపు మీదున్న సెహ్వాగ్.. బౌలర్ ఎవరైనా భరతం పట్టేలా ఉన్నాడు. దీనితో ఒత్తిడికి గురైన రాణా.. మొదటి బంతికే నో బాల్ వేశాడు. దాన్ని బౌండరీగా మలిచాడు సెహ్వాగ్. రెండో బంతి కూడా నోబాల్.. మళ్లీ ఫోర్.. మూడో బంతి కూడా నో బాల్.. ఇక నాలుగో బంతి లీగల్ డెలివరీ కాగా.. ఎలాంటి పరుగు రాలేదు. మళ్లీ ఐదో బంతిని రాణా నో బాల్ విసరగా.. సెహ్వాగ్ దాన్ని బౌండరీకి తరలించాడు. ఆరు బంతి కూడా నో బాల్ విసిరితే.. పరుగులేమి రాలేదు. చివరికి రెండో లీగల్ డెలివరీ వేయగా.. ఆ బంతిని కూడా సెహ్వాగ్ బౌండరీ కొట్టాడు.

దీంతో ఆ ఓవర్‌లో రెండు బంతులకే 21 పరుగులు వచ్చాయి. 4NB, 4NB, 0NB, 0, 4NB, 0NB, 4 రూపంలో సెహ్వాగ్ 21 పరుగులు రాబట్టుకున్నాడు. కాగా, క్రికెట్ ప్రపంచం ఇప్పటికీ అదే అత్యంత చెత్త ఓవర్ అని విశ్లేషకులు చెబుతుంటారు. ఇక రాణా ఆ ఓవర్‌లో మిగిలిన బంతులకు మూడు పరుగులు మాత్రమే ఇవ్వడం గమనార్హం.