AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy: పాకిస్థాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరిగేది ఎక్కడంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ICC ఈ టోర్నమెంట్‌ను పాకిస్తాన్ నుంచి మార్చనుందని తెలుస్తోంది. అలాగే T20 ప్రపంచ కప్ 2024ని కూడా వేరే దేశంలో నిర్వహించే ఛాన్స్ ఉందంట.

Champions Trophy: పాకిస్థాన్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరిగేది ఎక్కడంటే?
pakistan Cricket Team
Venkata Chari
|

Updated on: Jun 09, 2023 | 3:10 PM

Share

పాక్ వేదికగా జరగనున్న ఆసియా కప్‌పై సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ నుంచి మరో చిక్కు రానుందని తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం, 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యాన్ని పాకిస్థాన్ నుంచి లాక్కోవచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది పాక్ వేదికగా జరగనున్న ఆసియాకప్ ఆతిథ్యంపై ఉత్కంఠ నెలకొనడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ వివాదం తర్వాత, ఇప్పుడు ICC ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ నుంచి వెస్టిండీస్-అమెరికాకు మార్చాలని ప్లాన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

హోస్టింగ్‌ను లాక్కోవడం వల్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఎలాంటి నష్టం జరిగినా, ఐసీసీ దాన్ని భర్తీ చేస్తుంది. ఇదే జరిగితే PCBకి డబ్బు అయితే వస్తుంది. కానీ, ఆదేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం ఖాయమని తెలుస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మాత్రమే కాదు, టీ20 ప్రపంచ కప్ 2024 వేదిక కూడా మారవచ్చని అంటున్నారు. టీ20 ప్రపంచ కప్ 2024 వెస్టిండీస్-అమెరికాలో జరగాల్సి ఉంది. అయితే, దీనిని స్కాట్లాండ్, ఐర్లాండ్‌లలో నిర్వహించవచ్చని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం అందరి చూపు ఆసియా కప్‌పైనే ఉంది. దీని కారణంగా పాకిస్థాన్ ఆతిథ్యం లాగేసుకోవడం ఖాయం. టీమిండియాను పాకిస్థాన్‌కు పంపేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదు. ఇతర ఆసియా క్రికెట్ బోర్డులు పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌ను తిరస్కరించాయి. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..