AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI: కోహ్లీతో కలిసి ప్రపంచ కప్ ఆడారు.. కట్‌చేస్తే.. రూటు మార్చి అంపైర్ల అవతారం ఎత్తిన ప్లేయర్లు.. ఎవరంటే?

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఆగస్ట్ 17-19 వరకు అహ్మదాబాద్‌లో జరగనున్న బీసీసీఐ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, సెమినార్‌లకు అజితేష్, తన్మయ్ హాజరవుతారు. ఆ తర్వాత బోర్డు నిర్వహించే మ్యాచ్‌లలో అధికారికంగా కనిపిస్తారు. అంపైర్ కాబోతున్న తన్మయ్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. TOIతో మాట్లాడుతూ, BCCI అంపైరింగ్ ప్యానెల్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉందని తన్మయ్ ప్రకటించాడు. నేను క్రికెట్‌తో అనుబంధం కలిగి ఉండాలనుకుంటున్నాను.

BCCI: కోహ్లీతో కలిసి ప్రపంచ కప్ ఆడారు.. కట్‌చేస్తే.. రూటు మార్చి అంపైర్ల అవతారం ఎత్తిన ప్లేయర్లు.. ఎవరంటే?
Virat Kohli U19 Wc
Venkata Chari
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 31, 2023 | 8:55 AM

Share

భారత క్రికెట్‌లోని ఇద్దరు స్టార్ ఆటగాళ్లు తన్మయ్ శ్రీవాస్తవ, అజితేష్ అర్గల్ రిటైర్మెంట్ చేసిన చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు అంపైర్లు కాబోతున్నారు. తన్మయ్, అజితేష్ BCCI నిర్వహించిన అంపైరింగ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు వారిద్దరూ అంపైర్లు కాబోతున్నారు. అజితేష్‌, తన్మయ్‌ల ప్రత్యేకత ఏంటంటే.. వీరిద్దరూ 2008లో విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో అండర్‌-19 ప్రపంచకప్‌ ఆడారు. అలాగే ఛాంపియన్‌ టీమ్‌లో కూడా ఉన్నారు.

ఇద్దరూ గత నెలలో పరీక్ష హాజరు..

33 ఏళ్ల ఓపెనర్ బ్యాట్స్‌మెన్ తన్మయ్ శ్రీవాస్తవ, 34 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అజితేష్ అర్గల్ సుమారు 3-4 సంవత్సరాల క్రితం క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. గత నెలలో వీరిద్దరూ అహ్మదాబాద్‌లో జరిగిన అంపైరింగ్ పరీక్షకు హాజరయ్యారు. ఆ పరీక్ష ఫలితం జులై 26న వచ్చింది. ఇద్దరూ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. అతి త్వరలో వీరిద్దరూ భారత్‌లో జరిగే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో అఫీషియల్‌గా వ్యవహరించే అవకాశం లభించనుంది.

త్వరలో బీసీసీఐ ప్యానెల్‌లో భాగం..

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఆగస్ట్ 17-19 వరకు అహ్మదాబాద్‌లో జరగనున్న బీసీసీఐ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, సెమినార్‌లకు అజితేష్, తన్మయ్ హాజరవుతారు. ఆ తర్వాత బోర్డు నిర్వహించే మ్యాచ్‌లలో అధికారికంగా కనిపిస్తారు.

ఇవి కూడా చదవండి

అంపైర్ కాబోతున్న తన్మయ్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. TOIతో మాట్లాడుతూ, BCCI అంపైరింగ్ ప్యానెల్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉందని తన్మయ్ ప్రకటించాడు. నేను క్రికెట్‌తో అనుబంధం కలిగి ఉండాలనుకుంటున్నాను. అంపైరింగ్ ద్వారా అలా చేయడం నాకు మంచిది. ఇది నాకు కొత్త పాత్రకు నాంది. నేను కోచింగ్‌లో బాగానే ఉన్నాను. కానీ, మరింత ముందుకు వెళ్లాలనుకున్నాను. అంపైరింగ్ ఎంపిక మంచిదని నేను భావించాను. త్వరలో ఐసీసీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

తన్మయ్ క్రికెట్ రికార్డు..

తన్మయ్ శ్రీవాస్తవ, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్. ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు. 2008లో U-19 ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడు. తన్మయ్ ఆరు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 52.40 సగటుతో 262 పరుగులు చేశాడు. ఆఖరి మ్యాచ్‌లో అతను 46 పరుగుల ఇన్నింగ్స్‌ను సాధించాడు. తన్మయ్ 90 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 34.39 సగటుతో 4918 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతనికి 10 సెంచరీలు, 27 అర్ధసెంచరీలు ఉన్నాయి. తన్మయ్ 44 లిస్ట్ A మ్యాచ్‌ల్లో 44.30 సగటుతో 1728 పరుగులు చేశాడు. లిస్ట్ ఏలో అతనికి 7 సెంచరీలు ఉన్నాయి.

అజితేష్ క్రికెట్ కెరీర్..

అజితేష్ అర్గల్ 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 31.29 సగటుతో 24 వికెట్లు తీశాడు. 2008 అండర్-19 ప్రపంచకప్‌లో అజితేష్ బాగా బౌలింగ్ చేశాడు. ప్రపంచకప్ ఫైనల్‌లో తన బౌలింగ్‌తో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఆ మ్యాచ్‌లో 5 ఓవర్లలో 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్ తర్వాత అజితేష్, తన్మయ్ పూర్తిగా కనుమరుగయ్యారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..