రోహిత్‌ ఎదుగుదలకు ధోనినే కారణం: గంభీర్

క్రికెట్‌లో రోహిత్ శర్మ సక్సెస్ అవ్వడానికి అసలు కారణం ధోనినే అని అన్నారు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌. కెప్టెన్‌గా ఉన్న సమయంలో ధోని, రోహిత్‌కు చాలా సార్లు మద్దతుగా నిలిచాడని ఆయన పేర్కొన్నారు

  • Publish Date - 7:04 am, Mon, 4 May 20 Edited By:
రోహిత్‌ ఎదుగుదలకు ధోనినే కారణం: గంభీర్

క్రికెట్‌లో రోహిత్ శర్మ సక్సెస్ అవ్వడానికి అసలు కారణం ధోనినే అని అన్నారు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌. కెప్టెన్‌గా ఉన్న సమయంలో ధోని, రోహిత్‌కు చాలా సార్లు మద్దతుగా నిలిచాడని ఆయన పేర్కొన్నారు. జట్టులో రోహిత్ స్థానం ఎప్పుడూ ప్రశ్నార్ధకంగానే ఉండేదని.. ఆ సమయంలో ధోని తన మద్దతును ఇస్తూ వచ్చాడని గంభీర్ తెలిపారు. రోహిత్‌లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించిన ధోని.. అతడిని ప్రోత్సహించాడని అన్నారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గంభీర్.. రోహిత్ ఇప్పుడు ఈ స్థానంలో ఉండటానికి ధోనినే కారణం. సెలక్షన్‌ కమిటీ, టీమ్‌ మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించినా కెప్టెన్ నుంచి మద్దతు లేకపోతే జట్టులో చోటు చాలా కష్టం. ఎన్నో ఏళ్ల పాటు రోహిత్‌కు ధోని మద్దతుగా నిలిచాడు. ఇంతమంచి ప్రోత్సాహం ఏ ఇతర ఆటగాడికి దక్కి ఉండకపోవచ్చు అని అన్నారు. ఇక ఇప్పుడు రోహిత్, కోహ్లీలు యంగ్‌ క్రికెటర్‌లను ప్రోత్సహిస్తారని భావిస్తున్నానని గంభీర్‌ పేర్కొన్నారు.

Read This Story Also: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో రెండు రోజులు వర్షాలు..!