PV Sindhu: ‘ఈ విజయం కోసం ఎప్పటి నుంచో ఎదరు చూస్తున్న’.. స్వర్ణం గెలుచుకున్న తర్వాత టీవీ9తో పీవీ సింధు..
PV Sindhu: కామన్వెల్త్ గేమ్స్ 2022లో పీవీ సింధు గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి సింధు చరిత్ర..
PV Sindhu: కామన్వెల్త్ గేమ్స్ 2022లో పీవీ సింధు గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి సింధు చరిత్ర సృష్టించింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో కెనడా క్రీడాకారిణి మిచెల్ లీని ఫైనల్లో వరుస గేమ్‌లలో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో దేశ ప్రజలంతా ఆమెను ప్రశంసిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీపాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సింధును పొగుడుతూ ట్వీట్‌లు కూడా చేశారు.
ఇదిలా ఉంటే స్వర్ణాన్ని గెలుచుకున్న తర్వాత పీవీ సింధు తన సంతోషాన్ని టీవీ9తో పంచుకున్నారు. ఈ విజయం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాని తెలిపారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ‘నాలుగేళ్లకొకసారి జరిగే కామన్‌వెల్త్ గేమ్స్ చాలా ప్రత్యేకం. ఇందులో గోల్డ్ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో జ్ఞాపకాలను సొంతం చేసుకున్నాను. దేశం తరఫున మన క్రీడాకారులు మంచి ఆటతీరును కనబరిచారు. ప్రేక్షకులకు నా ధన్యవాదాలు, ఆట సమయంలో వారి అందించిన ప్రోత్సాహం మరవలేనిది. నాకు మద్ధతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, అభిమానులకు ధన్యవాదాలు’ తెలియజేసింది.
సింధు ఇంకా ఎమన్నరాంటే…
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..