Nikhat Zareen: ఎమ్మెల్సీ కవితతో సెల్ఫీ తీసుకున్న బాక్సింగ్‌ ఛాంపియన్‌.. తన ఎదుగుదలకు ఆమె సహకరించారంటూ..

| Edited By: Ravi Kiran

Aug 25, 2022 | 7:05 AM

Nikhat Zareen- MLC Kavitha: బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకంతో మెరిసింది తెలంగాణ బాక్సర్‌ నిఖత్ జరీన్‌. మహిళల 50 కేజీల విభాగంలో పసిడి సాధించి అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల జెండాను మరోసారి రెపరెపలాడించింది.

Nikhat Zareen: ఎమ్మెల్సీ కవితతో సెల్ఫీ తీసుకున్న బాక్సింగ్‌ ఛాంపియన్‌.. తన ఎదుగుదలకు ఆమె సహకరించారంటూ..
Nikhat Zareen Mlc Kavitha
Follow us on

Nikhat Zareen- MLC Kavitha: బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకంతో మెరిసింది తెలంగాణ బాక్సర్‌ నిఖత్ జరీన్‌. మహిళల 50 కేజీల విభాగంలో పసిడి సాధించి అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల జెండాను మరోసారి రెపరెపలాడించింది. ఈనేపథ్యంలో ప్రతిష్ఠాత్మక క్రీడల్లో సత్తాచాటిన స్టార్‌ బాక్సర్‌ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. తన నివాసంలో నిఖత్ కుటుంబసభ్యులను ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్‌.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ గా నిలవడం గర్వకారణమని ఎమ్మెల్సీ ప్రశంసించారు. ఆమె సాధించిన విజయాలు నేటి యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమన్నారు. ఇదే సమయంలో కవిత సాయం చేసిన విషయాన్ని నిఖత్‌ గుర్తు చేసుకుంటూ ఆమెతో సెల్ఫీ దిగారు.

తాను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రోజుల్లో కేసీఆర్​ దగ్గరికి తీసుకుపోయి కవిత, తనను ఆర్థికంగా ఆదుకున్నారని నిఖత్‌ గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో రూ.50 లక్షలు మంజూరు చేశారన్నారు. అదే విధంగా రూ.2 కోట్లు మంజూరు చేయడం, నివాస స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిందీ బాక్సింగ్‌ ఛాంపియన్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..