యాషెస్ తొలి టెస్ట్‌‌కి ఇంగ్లండ్ జట్టు…!

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2019 గురువారం నుండి ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో తలపడే జట్టును ప్రకటించింది. గత యాషెస్ సిరీస్‌ని ఆస్ట్రేలియా 4-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈసారి కచ్చితంగా విజయం సాధించాలని ఇంగ్లండ్ జట్టు పట్టుదలతో ఉంది. ఇప్పటికే ప్రపంచకప్‌ను కైవసం చేసుకొని మంచి జోరులో ఉన్న ఇంగ్లండ్.. అదే దూకుడును యాషెస్‌లోనూ […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:04 pm, Wed, 31 July 19
యాషెస్ తొలి టెస్ట్‌‌కి ఇంగ్లండ్ జట్టు...!

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2019 గురువారం నుండి ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో తలపడే జట్టును ప్రకటించింది. గత యాషెస్ సిరీస్‌ని ఆస్ట్రేలియా 4-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈసారి కచ్చితంగా విజయం సాధించాలని ఇంగ్లండ్ జట్టు పట్టుదలతో ఉంది. ఇప్పటికే ప్రపంచకప్‌ను కైవసం చేసుకొని మంచి జోరులో ఉన్న ఇంగ్లండ్.. అదే దూకుడును యాషెస్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది. తొలుత ఈ సిరీస్‌ కోసం ఎంపికైన 14 మంది ఆటగాళ్లలో.. తొలి టెస్ట్‌లో జోఫ్రా ఆర్చర్, శామ్ కర్రన్, ఒల్లి స్టోనీలకు చోటు దక్కలేదు. జో రూట్ సారథ్యంలో గురువారం బర్మింగ్‌హామ్ వేదికగా తొలి టెస్ట్ జరుగనుంది.

ఇంగ్లండ్ జట్టు వివరాలు: రాయ్ బర్న్స్, జేసన్ రాయ్, జో రూట్(కెప్టెన్), జో డెన్లీ, జాస్ బట్లర్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్‌సన్