పద మూడేళ్ల వయసుకే ప్రపంచం గుర్తుంచుకునేలా ఏం చేస్తారని ప్రశ్నించేవారికి అన్షుల్ భట్ ఓ నిదర్శనం. అవును.. ముంబైకి చెందిన 13 ఏళ్ల అన్షుల్ భట్ గత నెలలో ఇటలీలో జరిగిన ప్రపంచ యూత్ బ్రిడ్జ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. కార్డ్ గేమ్ ఈవెంట్‌లో మూడు స్వర్ణ పతకాలు సాధించి అందరినీ అబ్బురపరిచాడు. ఎందరో ప్రముఖుల మన్ననలు అందుకున్న అన్షుల్ భట్.. తాజాగా ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ నుంచి శుభాకాంక్షలను అందుకున్నాడు. ఈ మేరకు బిల్ బేట్స్ ట్విటర్ ద్వారా కార్డ్స్ గేమ్ పట్ల తనకున్న మక్కువను తెలుపుతూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ‘కొత్త యూత్ వరల్డ్ ఛాంపియన్ గురించి మరింత తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. బిలేటెడ్ కంగ్రాచ్యులేషన్స్ అన్షుల్ భట్’ అని గేట్స్ సెప్టెంబర్ 30న తన ట్వీట్‌లో తెలిపారు.
ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి అయిన భట్ బ్రిడ్జ్ గేమ్‌ను ఎంతో అలవోకగా ఆడేస్తాడు. గత ఏడాది ప్రతిష్టాత్మకమైన ‘జోన్ గెరార్డ్ యూత్’ అవార్డును సొంతం చేసుకున్నాడు అన్షుల్ భట్.
Very fun to learn more about the new youth world champion of my favorite pastime. Here’s a belated congratulations, Anshul Bhatt! https://t.co/5OpkmTqhIm
— Bill Gates (@BillGates) September 29, 2022
ఈ బహుమతి ఏటా ఆప్టిట్యూడ్, ఫెయిర్ ప్లే, ఇంటర్నేషనల్ స్పిరిట్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభకనబరచిన కీడాకారుల్లో ఒకరికి మాత్రమే ప్రధానం చేస్తారు. బ్రిడ్జ్ గేమ్ ఇద్దరి వ్యాక్తులు కలిసి ఆడే ఆట. ఐతే బ్రిడ్జ్ గేమ్‌ను క్రీడగా పరిగణించవచ్చా? లేదా? అనే దానిపై జరిగిన ఎన్నో చర్చల అనంతరం.. జకార్తా, పాలెంబాంగ్‌లో జరిగిన 2018 ఆసియా క్రీడల్లో తొలిసారిగా దీనిని చేర్చడం విశేషం.