బీసీసీఐ మెడికల్ టీమ్ సభ్యుడికి సోకిన కరోనా వైరస్!
పాడు కరోనా చివరాఖరికి ఆటలతో కూడా ఆటలాడుకుంటోంది.. కరోనా సమయంలో కాలక్షేపం కోసం కాసిన్ని ఆటలనైనా చూద్దామనుకుంటే ఆ ఎంజాయ్‌మెంట్ కూడా లేకుండా చేయాలనుకుంటోంది.
పాడు కరోనా చివరాఖరికి ఆటలతో కూడా ఆటలాడుకుంటోంది.. కరోనా సమయంలో కాలక్షేపం కోసం కాసిన్ని ఆటలనైనా చూద్దామనుకుంటే ఆ ఎంజాయ్‌మెంట్ కూడా లేకుండా చేయాలనుకుంటోంది.. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌నే తీసుకోండి.. భారత్‌లో పెరుగుతోన్న కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి షిష్ట్ చేశారా? అక్కడా అదే పరిస్థితి! ఈ సీజన్‌లో దుమ్ము రేపేందుకు అన్ని జట్లు దుబాయ్‌కి చేరాయి కూడా! అయితే ఎమిరేట్స్‌కు వెళ్లిన భారత క్రికెట్ బృందాన్ని నిను వీడని నీడను నేను అంటూ కరోనా వైరస్ వెంటాడుతోంది.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును భయాందోళనలకు గురి చేసిన వైరస్ ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డునూ భయపెట్టేస్తోంది.. బీసీసీఐ మెడికల్ టీమ్‌లోని ఓ మెంబర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.. ఐపీఎల్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లి తర్వాత 13 మంది చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులకు కరోనా సోకింది.. అయితే రెండు రోజుల కిందట వారందరికీ మరోసారి వైద్య పరీక్షలను నిర్వహిస్తే నెగటివ్ వచ్చింది.. దాంతో సీఎస్‌కే కుదుటపడింది..
ఇప్పుడేమో బీసీసీఐ మెడికల్ టీమ్ సభ్యుడికే కరోనా వచ్చింది.. మరోవైపు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న ఇద్దరు సభ్యులకు కూడా కరోనా అంటుకుంది.. బీసీసీఐ మెడికల్ టీమ్ మెంబర్‌కు కరోనా సోకిన మాట నిజమే అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదంటోంది బోర్డు.. ప్రస్తుతం అతను ఐసోలేషన్‌లో ఉన్నాడని… ఎవరితోనూ కాంటాక్ట్‌లో లేడని చెబుతోంది.. ఎమిరేట్స్‌కు వెళ్లే టైమ్‌లో కూడా ఏ క్రికెటర్‌తో అతడు కాంటాక్ట్ కాలేదని స్పష్టం చేస్తోంది..