యూ-19 ఫైనల్‌: టీమిండియాకు నిరాశ.. విశ్వ విజేత బంగ్లాదేశ్!

అండర్19 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు గెలుపొందింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో బంగ్లాదేశ్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా విజయానికి 15 పరుగుల దూరంలో ఉండగా వర్షం అంతరాయం ఏర్పడింది. మ్యాచ్‌ ప్రారంభమయ్యాక డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో బంగ్లా విజయాన్ని 46 ఓవర్లలో 170 పరుగులకు కుదించారు. 30 బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సిన […]

యూ-19 ఫైనల్‌: టీమిండియాకు నిరాశ.. విశ్వ విజేత బంగ్లాదేశ్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 10, 2020 | 6:16 AM

అండర్19 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు గెలుపొందింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో బంగ్లాదేశ్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా విజయానికి 15 పరుగుల దూరంలో ఉండగా వర్షం అంతరాయం ఏర్పడింది. మ్యాచ్‌ ప్రారంభమయ్యాక డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో బంగ్లా విజయాన్ని 46 ఓవర్లలో 170 పరుగులకు కుదించారు. 30 బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సిన స్థితిలో రకీబుల్‌ హసన్‌(9) బౌండరీ బాది జట్టును విజయ పథంలో నడిపించాడు. అంతకుముందు పర్వేజ్‌ ఇమాన్‌(47), అక్బర్‌ అలీ(43) బాధ్యతాయుతంగా ఆడి వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌(4), సుశాంత్‌ మిశ్రా(2), జైశ్వాల్‌ (1) వికెట్‌ తీశారు.

ఈ విజయంతో అండర్19 వరల్డ్ కప్‌ను బంగ్లా జట్టు తొలిసారి కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌(88; 121 బంతుల్లో 8×4, 1×6), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ తిలక్‌ వర్మ(38; 65 బంతుల్లో 3×4) రాణించడంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోర్‌ సాధించింది. లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఆది నుంచి బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో టీమ్‌ఇండియా క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టింది. బంగ్లా బౌలర్లలో అవిషేక్‌ దాస్‌(3), షోరిఫుల్‌ ఇస్లామ్‌(2), తన్జిమ్‌ హసన్‌(2), రకీబుల్‌ హసన్‌(1) వికెట్‌ తీశారు.

[svt-event date=”09/02/2020,10:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]