“బాబర్ అజామ్, కోహ్లితో స‌మానంగా ఆడ‌గ‌ల‌డు”

పాకిస్తాన్ ప్రధాన కోచ్ మిస్బా-ఉల్-హక్ ..పాక్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ బాబర్ అజామ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కుర‌పించాడు. ప్రపంచ అత్య‌త్త‌మ బ్యాట్స్ మెన్స్ విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్ లతో అత‌డు సమానంగా ఆడుతున్నాడ‌ని కితాబిచ్చాడు. “నాకు పోలికలు నచ్చవు కాని బాబర్ ప్రస్తుతం విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్ మాదిరిగా మార‌డానికి చాలా దగ్గరగా ఉన్నాడు” అని మిస్బా యూట్యూబ్ ఛానల్ క్రికెట్ బాజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో […]

బాబర్ అజామ్, కోహ్లితో స‌మానంగా ఆడ‌గ‌ల‌డు
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

May 27, 2020 | 9:26 AM

పాకిస్తాన్ ప్రధాన కోచ్ మిస్బా-ఉల్-హక్ ..పాక్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ బాబర్ అజామ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కుర‌పించాడు. ప్రపంచ అత్య‌త్త‌మ బ్యాట్స్ మెన్స్ విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్ లతో అత‌డు సమానంగా ఆడుతున్నాడ‌ని కితాబిచ్చాడు.

“నాకు పోలికలు నచ్చవు కాని బాబర్ ప్రస్తుతం విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్ మాదిరిగా మార‌డానికి చాలా దగ్గరగా ఉన్నాడు” అని మిస్బా యూట్యూబ్ ఛానల్ క్రికెట్ బాజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా గత ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు పాకిస్తాన్ టి 20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన 25 ఏళ్ల బాబర్ అజామ్.. ఇటీవల వన్డే జట్టు పగ్గాలు కూడా చేప‌ట్టాడు. బాబర్ వంటి ప‌రిప‌క్వ‌త ఉంటే, మిగతా జట్టు స‌భ్యుల‌ను ప్రేరేపించడం, మెరుగైన ఫ‌లితాలు సాధించ‌డం సులభం అవుతుందని మిస్బా-ఉల్-హక్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

“2010 లో నన్ను కెప్టెన్‌గా చేసినప్పుడు కూడా నా ప్రదర్శనలు ఓ మాదిరిగా ఉన్నాయి. కానీ కెప్టెన్సీ నా ఆట తీరును, మనస్తత్వాన్ని మార్చివేసింది. నేను మరింత కష్టపడి, అగ్ర‌శ్రేణి క్రికెటర్ అయ్యాను” అని మిస్బా వెల్ల‌డించాడు.

బాబ‌ర్ అజామ్ తన సొంత జోన్లో ఉంటాడ‌ని.. అతను డబ్బు కోసం కాకుండా.. పాకిస్తాన్ కొరకు అగ్రశ్రేణి ప్రదర్శనకారుడిగా ఉండాలని కోరుకుంటాడని మిస్బా పేర్కొన్నాడు. నెట్స్‌లో సాధ‌న‌ మైదానంలో సవాళ్లను ప్రేమిస్తాడు, అతను నిజంగా ఆటగాడిగా పరిణతి చెందాడని.. కాలక్రమేణా అనుభవంతో కెప్టెన్‌గా మెరుగవుతాడని త‌న శిష్యుడ్ని తెగ పొగిడేశాడు మిస్బా-ఉల్-హక్.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu