అక్త‌ర్ కు భారీ షాక్..రూ.కోటి పరువు నష్టం నోటీసులు..!

పాక్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షోయబ్ అక్తర్ కు భారీ షాక్ త‌గిలింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ‌‌.. బహిరంగ క్షమాపణలతో పాటు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని బోర్డు లీగల్ అడ్వైజర్ తఫాజుల్ రిజ్వీ డిమాండ్ చేశాడు. పీసీబీలో సంస్కరణల గురించి గత కొంతకాలంగా సూచనలు చేస్తున్న అక్తర్.. ఇటీవల ఉమర్ అక్మల్‌‌పై విధించిన మూడేళ్ల బ్యాన్ ను ఓ పనికిమాలిన చర్యగా అభివర్ణిస్తూ బోర్డు నిర్ణయాన్ని వ్య‌తిరేకించాడు. అక్తర్ చేసిన ఈ […]

అక్త‌ర్ కు భారీ షాక్..రూ.కోటి పరువు నష్టం నోటీసులు..!
Follow us

|

Updated on: May 26, 2020 | 6:42 PM

పాక్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ షోయబ్ అక్తర్ కు భారీ షాక్ త‌గిలింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ‌‌.. బహిరంగ క్షమాపణలతో పాటు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని బోర్డు లీగల్ అడ్వైజర్ తఫాజుల్ రిజ్వీ డిమాండ్ చేశాడు. పీసీబీలో సంస్కరణల గురించి గత కొంతకాలంగా సూచనలు చేస్తున్న అక్తర్.. ఇటీవల ఉమర్ అక్మల్‌‌పై విధించిన మూడేళ్ల బ్యాన్ ను ఓ పనికిమాలిన చర్యగా అభివర్ణిస్తూ బోర్డు నిర్ణయాన్ని వ్య‌తిరేకించాడు. అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అతడ్ని క‌ష్టాల్లోకి లాగాయి. పీసీబీ లీగల్ అడ్వైజర్ తఫాజుల్ రిజ్వీ మాజీ పేస‌ర్ కు పరువు నష్టం నోటీసులు పంపాడు. ఈ నోటీసులకు అక్త‌ర్ వివరణ కూడా ఇచ్చాడు. అయితే అక్తర్ వివరణ సంతృప్తిక‌రంగా లేద‌ని, అతన్ని కోర్టు లాగే వరకు ఊరుకోమ‌ని తాజాగా తఫాజుల్ పేర్కొన్నాడు. ‘

ఇక తఫాజుల్ పరువు నష్టం దావా నోటీసులు విస్మయాన్ని క‌లిగించాయ‌ని ఇటీవల షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చారు. ‘పాకిస్థాన్ క్రికెట్ బోర్డు‌ పనితీరు మెరుగయ్యేందుకే నేను కొన్ని సూచ‌న‌లు చేశా. అది కూడా పీసీబీలో మంచి జ‌ర‌గాల‌ని త‌ప్ప మ‌రో ఉద్దేశంతో కాదు. రిజ్వీ గురించి నేను చేసిన కామెంట్స్ అతనితో నాకు వ్యక్తిగతంగా ఉన్న చనువుతో అన్న‌వే. కానీ రిజ్వీనే నాకు నోటీసులు పంపి అవమాక‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. కాబట్టి అతనే నాకు మొద‌ట‌ క్షమాపణలు చెప్పాలి’ అని అక్తర్ డిమాండ్ చేశాడు. అయితే అక్తర్ కామెంట్స్ పై వేసిన పరువు నష్టం దావా.. తఫాజుల్ రిజ్వీ వ్యక్తిగతమని, దాంతో బోర్డుకు సంబంధం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

Latest Articles