AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కామారెడ్డిలో కలకలం..చెరువులో మ‌ృతదేహం..?

కామారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద చెరువులో పడి ఓ వ్యక్తి మ‌ృతిచెందాడు.

కామారెడ్డిలో కలకలం..చెరువులో మ‌ృతదేహం..?
Jyothi Gadda
|

Updated on: May 26, 2020 | 6:50 PM

Share

కామారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద చెరువులో పడి ఓ వ్యక్తి మ‌ృతిచెందాడు. నీళ్లలో బాడీ పైకి తేలటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..మ‌ృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్ధిపేట జిల్లా కేంద్రానికి చెందిన వీరభద్ర నాగరాజు (42) తన రెండో భార్య భాగ్య, కూతురుతో కలిసి కామారెడ్డిలో నివాసముంటున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో గత రెండు నెలల నుండి జంగంపల్లి గ్రామంలో నివాసముంటున్నారు. కాగా, సోమవారం మధ్యాహ్నం నాగరాజు ఇంటి నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం జంగంపల్లి చెరువులో గ్రామస్తులకు మృతదేహం కనిపించడంతో కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Follow Us
2వ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
2వ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం తొలి 13
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం తొలి 13
TET 2026కు భారీ స్పందన.. 56 వేల ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు
TET 2026కు భారీ స్పందన.. 56 వేల ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 3 యాప్‌లపై నిషేధం!
కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 3 యాప్‌లపై నిషేధం!
మన పూర్వీకులంతా బలంగా ఉక్కులా ఉండడానికి వారు తాగిన డ్రింక్ ఇదే
మన పూర్వీకులంతా బలంగా ఉక్కులా ఉండడానికి వారు తాగిన డ్రింక్ ఇదే
ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ
ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన..
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన..
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు..
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు..